ETV Bharat / city

Rush at RTC Bus and Railway stations : పండక్కి సొంతూళ్లకు జనం.. రద్దీగా ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు.. - సంక్రాంతికి ప్రత్యేక బస్సులు

Rush at RTC Bus and Railway stations : సంబరాల సంక్రాంతికి సరదాగా జరుపుకోవాలని అంతా సొంతూళ్ల బాట పట్టారు. విద్య,ఉద్యోగం,వ్యాపారం ఇలా రకరకాల కారణాల చేత సొంతూరికి,సొంత వారికి దూరంగా ఉన్నవారంతా వారి వారి ప్రాంతాలకు పెద్ద పండక్కి పరుగులు పెడుతున్నారు. సొంతూళ్లకు పయనమవుతున్న ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్లు,రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి.మరోవైపు సొంత వాహనాల్లో వెళ్లే వారితో రహదారులు రద్దీగా మారాయి.

Rush at RTC Bus and Railway stations
పండక్కి సొంతూళ్లకు జనం.. రద్దీగా ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు..
author img

By

Published : Jan 12, 2022, 8:02 PM IST

Updated : Jan 12, 2022, 9:13 PM IST

Rush at RTC Bus and Railway stations : సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారితో ప్రయాణ ప్రాంగణాలు కిక్కిరిస్తున్నాయి. ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా..ఆర్టీసీ, దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక బస్సులు, రైళ్లను ఏర్పాటు చేశాయి.

కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. మాస్కు ఉంటేనే ప్రయాణానికి అనుమతిస్తోంది. ఆర్టీసీప్రయాణ ప్రాంగణాల్లో మాస్కు లేకుండా తిరిగితే జరిమానా విధిస్తోంది. సొంతూళ్లకు వెళ్లేవారితో రైల్వేస్టేషన్లలో రద్దీ నెలకొంది. పలు ప్రాంతాలకు ద.మ.రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది.

చర్యలకు సిద్ధమైన రవాణాశాఖ..

అధిక ఛార్జీలు వసూలు చేసేవారిపై రవాణాశాఖ చర్యలకు సిద్ధమైంది. ఫిర్యాదుల కోసం వాట్సప్ నంబర్ 91542 94722 ఏర్పాటు చేసింది. ప్రైవేటు ట్రావెల్స్‌పై తనిఖీలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద విస్తృత తనిఖీలు చేపడుతున్నట్లు పేర్కొంది.

ఇదీ చదవండి : CM Jagan convey sankaranthi wishes: తెలుగువారందరికీ సీఎం జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు

రద్దీగా హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారి...

సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రా ప్రాంతం వాసుల రాకతో హైదరాబాద్ -విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది. కీసర టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాలు చేరుకుంటున్నాయి. సంక్రాంతి పండగ సెలవులను ప్రకటించడంతో హైదరాబాద్ లో నివాసం ఉంటున్న ఆంధ్ర వాసులు తమ సొంత ఊర్లకు పయనమయ్యారు. దీంతో కేసర టోల్గేట్ వద్ద కార్లు బారులు తీరాయి. టోల్ గేట్ వద్ద వాహనాలు ఆగకుండా.. టోల్ ప్లాజా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే మార్గంలో ఐదు కౌంటర్లు ఏర్పాటు చేసి వాహనాల రద్దీని తగ్గిస్తున్నారు.

ఇదీ చదవండి : Film Producer NVPrasad on MLA Comments: ప్రసన్న కుమార్.. వ్యాఖ్యలు వెనక్కి తీసుకో -నిర్మాత ఎన్వీ ప్రసాద్

Last Updated : Jan 12, 2022, 9:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.