ETV Bharat / city

APCC: మద్యం అమ్మకాలు తగ్గితే ప్రభుత్వ ఆదాయం ఎలా పెరిగింది ?: శైలజానాథ్ - మద్యం అమ్మకాలు తగ్గితే ప్రభుత్వ ఆదాయం ఎలా పెరిగింది

ఓ వైపు మద్యం దుకాణాలు తగ్గిస్తున్నామంటూ లెక్కల్లో చూపించి.. మరోవైపు వేరే రూపంలో దుకాణాల ఏర్పాటుకు తెర లేపారని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. మద్యం అమ్మకాలు తగ్గితే ప్రభుత్వ ఆదాయం ఎలా పెరిగిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

మద్యం అమ్మకాలు తగ్గితే ప్రభుత్వ ఆదాయం ఎలా పెరిగింది ?

author img

By

Published : Oct 5, 2021, 7:20 PM IST

రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గితే ప్రభుత్వ ఆదాయం ఎలా పెరిగిందో సమాధానం చెప్పాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సాకే శైలాజనాథ్ డిమాండ్ చేశారు. పనికిమాలిన పేర్లతో చీప్ లిక్కర్ విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఓ వైపు మద్యం దుకాణాలు తగ్గిస్తున్నామంటూ లెక్కల్లో చూపించి మరోవైపు వేరే రూపంలో దుకాణాల ఏర్పాటుకు తెర లేపారని దుయ్యబట్టారు.

ఏపీఎస్బీసీఎల్ ఇప్పటికే కొన్నిచోట్ల ప్రయోగాత్మకంగా వాకిన్ స్టోర్స్ నిర్వహిస్తోందని, సాధారణ మద్యం దుకాణాల్లో రోజుకు సగటున రూ.2-2.50 లక్షల మద్యం అమ్ముడైతే, వాకిన్ స్టోర్​లో రూ.7-8 లక్షల మద్యం విక్రయిస్తున్నారన్నారు. నిజంగా సంపూర్ణ మద్య నిషేధం చేయాలనే చిత్తశుద్ది ప్రభుత్వానికి ఉంటే..వీలైనన్ని మార్గాల్లో చర్యలు తీసుకోవాలని శైలజానాథ్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి

Priyanka Gandhi news: ప్రియాంకా గాంధీపై ఎఫ్​ఐఆర్​ నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.