హైదరాబాద్ సంస్కృతి, సంప్రదాయానికి అద్దం పట్టే సదర్ సంబురానికి జంట నగరాలు ముస్తాబయ్యాయి. డప్పు దరువులు, విన్యాసాలతో సాగే ఊరేగింపు కోసం బస్తీలన్నీ సిద్ధమయ్యాయి. పశువుల ఆటవిడుపు ఆకట్టుకునేలా ఈ ఏడాది నిర్వహించే సదర్ ఉత్సవాలల్లో బహబలి దున్నరాజు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. దీనిని చూసేందుకు నగరవాసులు పెద్దఎత్తున తరలివచ్చి వస్తున్నారు.
సదర్ ఉత్సవాల కోసం దున్నలను కొంతమంది ఇక్కడే పెంచుతుండగా.. మరికొందరు హరియాణా నుంచి తీసుకువస్తున్నారు. ఏటా సదర్ వేడుకల్లో దున్నలతో విన్యాసాలు చేయిస్తున్నారు. చాపెల్ బజార్‌కు చెందిన లడ్డూ యాదవ్... హరియాణా నుంచి బాహుబలి దున్నను తెప్పించారు. దున్న యజమాని ఎలాంటి రుసుము తీసుకోలేదు. ఉచితంగా ప్రదర్శనకు పంపించాడు. యజమాని బల్‌వీర్ సింగ్ ఉదారతకు బదులుగా లడ్డూ యాదవ్.. బాహుబలి దున్నకు మూడు కిలోల బంగారు గొలుసును కానుకగా ఇచ్చాడు. దాదాపు కోటిన్నర విలువైన 3 కిలోల బంగారు గొలుసును దున్న మెడకు వేశారు.
కొవిడ్ కారణంగా గతేడాది నిర్వహించ లేకపోయిన సదర్ ఉత్సవాలను ఈసారి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నందున సదర్ సయ్యాటలను ప్రజలు తిలకించాలన్నారు. రైతులు, పాడి సంపదను నమ్ముకున్న ప్రతి ఒక్కరు చల్లగా ఉండాలని లక్ష్మీదేవిని పూజించి యాదవులు నిర్వహించే ఈ సదర్ ఉత్సవాలు నిజాం కాలం నుంచి నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి : Nakshatra Vanam : అప్పన్న సన్నిధిలో కార్తీక నక్షత్ర వనం... ప్రారంభించిన శారదా పీఠాధిపతి