ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ.. సంస్థ ఎండీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక లేఖ రాసింది. ఎన్ఎంయూ (N.M.U), ఈయూ (E.U), కార్మిక పరిషత్ సహా 14 సంఘాలతో.. ఇటీవల ఐక్యవేదిక ఏర్పాటు చేశారు. సంస్థ ఉద్యోగులకు.. (ఈహెచ్ఎస్) E.H.S. నుంచి మినహాయింపు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వంలో విలీనానికి ముందు ఉన్నట్లుగానే వైద్యం అందించాలని ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఆస్పత్రులు లేదా రిఫరల్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యానికి విఙ్ఞప్తి చేశారు.
ఈనెల 1న లేఖ ఇచ్చినా.. ఇప్పటివరకు స్పందన లేదని గుర్తుచేశారు. ఇప్పటికే ఇచ్చిన మెమోరాండంలోని 45 డిమాండ్లు పరిష్కరించాలని లేఖలో ప్రస్తావించారు. జాప్యం చేస్తే.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమబాట పడతామన్నారు. పీఆర్సీపై ప్రభుత్వ జీవోలు సత్వరమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి
AP High Court: హైకోర్టు నూతన న్యాయమూర్తులుగా ఏడుగురు ప్రమాణ స్వీకారం