ETV Bharat / city

పీఆర్సీ జీవోలో మార్పులు చేయకపోతే.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలు: ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక

author img

By

Published : Jun 9, 2022, 8:07 PM IST

RTC LETTER: పీఆర్సీ జీవోల వల్ల ఆర్టీసీ ఉద్యోగులకు నష్టం జరుగుతోందని ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక నాయకులు వెల్లడించారు. ఈ మేరకు ఆర్టీసీ ఉద్యోగులు సీఎం జగన్‌కు లేఖ రాశారు. తమ సమస్యలను సత్వరమే చర్చించి పరిష్కరించాలని.. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగనున్నట్లు ఉద్యోగులు స్పష్టం చేశారు.

rtc
ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక

RTC LETTER: పీఆర్సీ జీవోల వల్ల ఆర్టీసీ ఉద్యోగులకు నష్టం జరుగుతోందని ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక నాయకులు వెల్లడించారు. ఈ మేరకు ఆర్టీసీ ఉద్యోగులు సీఎం జగన్‌కు లేఖ రాశారు. తమకు న్యాయం చేయాలని ఉద్యోగులు లేఖలో పేర్కొన్నారు. పీఆర్సీ జీవోలో మార్పులు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. తమ సమస్యలను సత్వరమే చర్చించి పరిష్కరించాలని.. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగనున్నట్లు ఉద్యోగులు స్పష్టం చేశారు. ఆందోళనలకు సంబంధించిన కార్యాచరణను ఐక్య వేదిక నేతలు ప్రకటించారు. సంస్థలో బలవంతపు బదిలీలను వెంటనే నిలిపివేయాలని యాజమాన్యాన్ని కోరారు.

ప్రభుత్వం ప్రకటించిన కరవుభత్యం 4.7% లో 1.6% డీఏని తగ్గించారని తెలిపారు. ప్రభుత్వంలో విలీనం వల్ల పలు బెనిఫిట్స్​ను కోల్పోయామని,.. పీఆర్సీ జీవోల వల్ల సంస్థలోని అన్ని విభాగాల్లో ఉన్న ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి ఆదేశాలు ఇవ్వడం ఇంతవరకు దేశంలో ఎక్కడా జరగలేదని ఆర్టీసీ ఉద్యోగుల ఐక్యవేదిక లేఖలో పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసి ఉద్యోగులకు జీతభత్యాలలో ఉన్న తేడాలను ప్రభుత్వం సరిచేయలేదని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులందరికీ న్యాయం జరిగేలా ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలని ఐక్యవేదిక నేతలు కోరారు. ఈ నెల 13, 14 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు ఎర్ర బ్యాడ్జీలతో విధులకు హాజరవ్వాలని ఐక్యవేదిక పిలుపునిచ్చింది. 26 జిల్లాల్లో ఉన్న అన్ని డిపో యూనిట్ల వద్ద భోజన విరామ సమయంలో నిరసన తెలపాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా 129 డిపోల్లో గేట్ మీటింగ్​లు నిర్వహించాలని.. దాని ద్వారా పీఆర్సీ జీవోల వల్ల నష్టాలపై ఉద్యోగులకు అవగాహన కల్పించాలని నిర్ణయించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.