ETV Bharat / city

కొందరు ఆర్టీసీ అధికారుల తీరుతో ఉద్యోగుల ప్రాణాలకు ముప్పు

RTC Employees Letter To MD కొందరు ఆర్టీసీ అధికారుల తీరుతో ఉద్యోగుల ప్రాణాలకు ముప్పు ఉందని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక ఆరోపించింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీకి లేఖ రాసిన ఐక్యవేదిక నేతలు ఉద్యోగులపై కక్ష సాధింపుచర్యలు నానాటికి పెరిగి పోతున్నాయన్నారు.

కొందరు ఆర్టీసీ అధికారుల తీరుతో ఉద్యోగుల ప్రాణాలకు ముప్పు
కొందరు ఆర్టీసీ అధికారుల తీరుతో ఉద్యోగుల ప్రాణాలకు ముప్పు
author img

By

Published : Aug 24, 2022, 4:48 PM IST

Updated : Aug 24, 2022, 7:40 PM IST

ఆర్టీసీ ఎండీకి రాసిన లేఖ
ఆర్టీసీ ఎండీకి రాసిన లేఖ

RTC Employees Letter To MD Dwaraka Tirumala Rao ఏపీఎస్ ఆర్టీసీలో కొందరు అధికారుల తీరు బాగాలేదంటూ ఆ సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావుకు ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక లేఖ రాసింది. కొందరు అధికారులు, సూపర్​ వైజర్ల తీరుతో ఉద్యోగుల ప్రాణాలకు ముప్పు ఉందని లేఖలో పేర్కొంది. ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలు నానాటికి పెరిగి పోతున్నాయన్నారు. కొందరు ఉద్యోగులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు వచ్చాయని ఆర్టీసీ ఎన్​ఎంయూ, ఎంప్లాయిస్ యూనియన్, ఎస్​డబ్ల్యూఎఫ్ తదితర సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.

తిరుపతి జిల్లా వెంకటగిరి డిపోలో అధికారులు ఇబ్బందు వల్ల సీహెచ్ చెంచయ్య అనే ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నారన్నారు. వైఎస్సార్ జిల్లా పొద్దుటూరు డిపోలో నజీర్ అహమ్మద్ అనే ఉద్యోగిపై డిపో మేనేజర్ ఫోన్​లో దుర్భాషలాడారన్నారు. ఈ రెండు ఘటనలకు సంబంధించిన బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకొవాలని ఐక్యవేదిక నేతలు ఎండీని కోరారు. భవిష్యత్​లో ఇలాంటి సంఘటనలు జరుగకుండా కూడా చూడాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.

ముగిసిన కార్గో ప్రచార మాసోత్సవం: ఏపీఎస్ ఆర్టీసీ కార్గో ప్రచార మాసోత్సవం ముగిసింది. ముగింపు రోజున 30 పార్సిళ్లను ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు కార్గో ద్వారా బుక్ చేశారు. 26 జిల్లాల ఆర్​ఎంలు, 4 జోన్ల ఈడీలకు పుస్తకాలను ఆర్టీసీ కార్గో ద్వారా పంపించారు. 'ఫ్యామిలీ విస్ డమ్' అనే మనో వికాస పుస్తకాన్ని అధికారుల ఇళ్లకు డోర్ డెలివరీ ద్వారా ఎండీ పంపారు. సిబ్బందిలో స్పూర్తి నింపేలా తనవంతుగా 30 డోర్ డెలివరీ కార్గో బుకింగ్స్ చేసినట్లు ఎండీ తెలిపారు. ఆర్టీసీ కార్గోలో ఇటీవలే ప్రవేశపెట్టిన యూపీఐ చెల్లింపుల విధానాన్ని ద్వారకా తిరుమల రావు పరిశీలించారు.

ఇవీ చూడండి

Last Updated : Aug 24, 2022, 7:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.