ETV Bharat / city

RPF constable rescued woman : రెప్పపాటులో మహిళను కాపాడిన ఆర్పీఎఫ్​ కానిస్టేబుల్​ - మహబూబ్​నగర్​ రైల్వే స్టేషన్​లో మహిళ ఆత్మహత్యాయత్నం

RPF constable rescued woman : కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకోడానికి రైలుకింద పడబోయిన ఓ మహిళను లేడీ ఆర్పీఎఫ్​ కానిస్టేబుల్​ రక్షించింది. ఈ ఘటన.. తెలంగాణలోని మహబూబ్​నగర్​ రైల్వేస్టేషన్​లో జరిగింది.

రెప్పపాటులో మహిళను కాపాడిన ఆర్పీఎఫ్​ కానిస్టేబుల్​
RPF constable rescued woman
author img

By

Published : Jan 9, 2022, 10:58 PM IST

RPF constable rescued woman : కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్య చేసుకోడానికి సిద్ధమైంది. రైలు కింద పడేందుకు వచ్చిన ఆమెను.. మహిళా ఆర్పీఎఫ్​ కానిస్టేబుల్​ రెప్పపాటులో కాపాడింది. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్​నగర్​ రైల్వే స్టేషన్​లో ఈనెల 7న జరిగిన ఈ ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

రెప్పపాటులో మహిళను కాపాడిన ఆర్పీఎఫ్​ కానిస్టేబుల్​

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం మోతీనగర్ వార్డుకు చెందిన యాదమ్మ(40) కుటుంబ కలహాలతో తీవ్ర ఆవేదనకు గురైంది. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఈనెల 7న మహబూబ్​నగర్ రైల్వేస్టేషన్​ వచ్చింది. ఏపీ నుంచి దిల్లీ వెళ్తున్న సంపర్క్ ​క్రాంతి ఎక్స్​ప్రెస్​.. స్టేషన్​కు సమీపిస్తున్న సమయంలో ఒక్కసారిగా ట్రాక్​మీదకు వెళ్లి నిలబడింది.

అక్కడే విధులు నిర్వహిస్తున్న ఆర్పీఎఫ్​ కానిస్టేబుల్ పూనమ్​.. రెప్పపాటులో అప్రమత్తమై..​ యాదమ్మను పక్కకు లాగేసింది. దీంతో.. ఆమె ప్రాణాలు నిలిచాయి. పట్టాలపై మహిళను గుర్తించిన లోకోపైలట్​ అత్యవసర పరిస్థితిలో రైలును నిలిపేయడం కూడా కలిసి వచ్చింది.

అనంతరం.. యాదమ్మను అదుపులోకి తీసుకున్న రైల్వే పోలీసులు.. ఆమెకు కౌన్సెలింగ్​ ఇచ్చి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. రెప్పపాటులో మహిళను కాపాడిన ఆర్పీఎస్​ కానిస్టేబుల్​ పూనమ్​ను రైల్వే సిబ్బంది, అధికారులు అభినందించారు.

ఇదీ చూడండి:

Attack: విజయవాడలో దారుణం.. యువతి గొంతు కోసిన యువకుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.