ETV Bharat / city

'సలాం కుటుంబం ఆత్మహత్యకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే' - సలాం కుటుంబం ఆత్మహత్య తాజా వార్తలు

సలాం కుటుంబం ఆత్మహత్యకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని సలాం న్యాయ పోరాట సమితి ఆర్గనైజింగ్ కన్వీనర్ ఫారూఖ్ షిబ్లీ విమర్శించారు. సలాంను వేధించినట్లే గతంలో ప్రసాద్ అనే వ్యక్తిని సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్​ వేధించారని షిబ్లీ ఆరోపించారు. అధికారులు అప్పుడే స్పందించి సీఐ, హెడ్ కానిస్టేబుల్​పై చర్యలు తీసుకుని ఉంటే సలాం కుటుంబం బతికి ఉండేదన్నారు.

'సలాం కుటుంబం ఆత్మహత్యకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే'

author img

By

Published : Nov 17, 2020, 7:29 PM IST

అబ్దుల్ సలాం కుటుంబ ఆత్మహత్య ఘటనపై నేడు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినట్లు సలాం న్యాయ పోరాట సమితి ఆర్గనైజింగ్ కన్వీనర్ ఫారూఖ్ షిబ్లీ తెలిపారు. సలాంను వేధించినట్లే ప్రసాద్ అనే వ్యక్తిని సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్​లు వేధించారని షిబ్లీ ఆరోపించారు. దీనిపై 11 నెలల క్రితమే ప్రసాద్ ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపీకి లేఖ రాసినా...ఫలితం లేకుండా పోయిందన్నారు.

అధికారులు అప్పుడే స్పందించి సీఐ, హెడ్ కానిస్టేబుల్​పై చర్యలు తీసుకుని ఉంటే సలాం కుటుంబం బతికి ఉండేదన్నారు. సలాం కుటుంబం ఆత్మహత్యకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనన్న షిబ్లీ... కేసును రాష్ట్ర పోలీసులతో దర్యాప్తు చేయిస్తే చేతికి బూడిద తప్ప ఏం రాదని దుయ్యబట్టారు.

ఇదీ చదవండి:

సీఐ, హెడ్‌ కానిస్టేబుల్‌ బెయిల్‌ రద్దు పిటిషన్​పై విచారణ 19కి వాయిదా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.