ETV Bharat / city

కరోనాతో ఆసుపత్రులకు వెళ్లలేకపోతున్నారా.. ఇంటికే ఆసుపత్రి!

కరోనా విజృంభిస్తోంది. కొవిడ్‌ సోకితే ఆ కుటుంబానికి ఎన్నో సమస్యలు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడక సమస్య ఒకవైపు.. కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేరితే ఆర్థిక కష్టాలు ఇంకోవైపు.. ఇలాంటి పరిస్థితులలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు హోంఐసొలేషన్‌లోనే ఉపశమనం పొందే మార్గాలపై అవగాహన కలిగిస్తున్నాయి. విజయవాడకు చెందిన రూట్స్ ఫౌండేషన్ కరోనా బాధితులు.. వారి ఇళ్లలోనే ఉండి వైద్యం పొందే మార్గాలను వివరిస్తోంది.

కరోనాతో ఆసుపత్రులకు వెళ్లలేని వారి.. ఇంటికే ఆసుపత్రి వస్తుంది!

author img

By

Published : Apr 25, 2021, 12:37 PM IST

కరోనాతో ఆసుపత్రులకు వెళ్లలేని వారి.. ఇంటికే ఆసుపత్రి వస్తుంది!

ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఎక్కువ మంది వైద్యులను సంప్రదించి, వారి సలహాలు తీసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. సెకండ్ వేవ్ రూపంలో కరోనా కరాళ నృత్యమే చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యల్లో కేసులు నమోదు అవుతున్నాయి. పేద, ధనిక అనే తేడా లేకుండా అనేకమందికి వైరస్ సోకుతుంది. విజయవాడ రూట్స్ ఫౌండేషన్ కరోనా రోగులకు, వారి వారి ఇళ్లలోనే వైద్యం అందించేందుకు గత ఏడాదిలోనే కార్యాచరణ రూపొందించింది. ఆ ప్రణాళికలు విజయవంతం కావడంతో, సెకండ్ వేవ్ తరుముకొస్తున్న ఈ సమయంలో మళ్లీ కరోనా బాధితులను వైరస్ బారినుంచి బయటపడేసే కార్యక్రమాలు చేస్తున్నామని.. రూట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ పోలవరపు విజయభాస్కర్ తెలిపారు.

రూట్స్‌ ఫౌండేషన్‌ ఓ సంచార వాహనం... ఎప్పుడు సిబ్బంది అందుబాటులో ఉంటారు. వైద్యానికి కావాల్సిన మెడికల్ కిట్లు రెడీగా ఉంటాయి. గతేడాది కరోనా సోకి రూట్స్ ఫౌండేషన్ ద్వారా వైద్యం పొందిన వారంతా, ఫౌండేషన్ సేవలకు సంతృప్తి చెందారు. వృద్ధులను సైతం ఎలాంటి ఇబ్బందులూ, ప్రాణాపాయం లేకుండా వైద్యం పొంది ప్రస్తుతం అంతా ఆరోగ్యంగా ఉంటున్నారు.

ఆసుపత్రుల్లో చేరేందుకు అవకాశం లేని.. వారు రూట్స్ ఫౌండేషన్​ను సంప్రదిస్తే సకాలంలో వైద్య సహాయం అందిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: ఔరా: మూడు టన్నుల పాత ఐరన్ స్క్రాప్​తో 'జీపు' తయారీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.