ETV Bharat / city

తుపాకీ మిస్​ఫైర్: హోంగార్డు భార్య మృతి.. వెలుగులోకి కొత్తకోణం - vijayawada police latest news

విజయవాడలో తుపాకీ మిస్ ఫైర్ ఘటన వివాదాస్పదమవుతోంది. మిస్ ఫైర్ వల్లే తన భార్య చనిపోయిందని హోమ్ గార్డ్ చెబుతున్నా.. అసలు విషయం వేరే అని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

mis fire
తుపాకి మిస్ ​ఫైర్​.. హోంగార్డు భార్య మృతి
author img

By

Published : Apr 12, 2021, 8:57 AM IST

Updated : Apr 12, 2021, 2:21 PM IST

తుపాకీ మిస్ ​ఫైర్..

అసలేం జరిగింది??

తుపాకీ మిస్‌ఫైర్ కావడంతో హోంగార్డు భార్య ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన విజయవాడలోని గొల్లపూడిలో జరిగింది. మౌలానగర్‌లో నివాసం ఉంటున్న హోంగార్డు వినోద్‌కుమార్‌.. సీఎం సెక్యూరిటీ వింగ్ ఏఎస్పీ శశిభూషణ్ వద్ద అసిస్టెంట్​గా పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితం ఏఎస్పీ శశిభూణన్ క్యాంప్​కు అనంతపురం వెళ్లారు. ఆ సమయంలో ఏఎస్పీ తుపాకి హోంగార్డు వినోద్ వద్ద ఉంది.

మీడియాతో ఏసీపీ హనుమంతరావు

ఆదివారం రాత్రి భార్యకు సరదాగా తుపాకీ చూపిస్తున్న సమయంలో మిస్ ఫైర్ జరిగి.. తుపాకీ గుండు వినోద్ భార్య సూర్యరత్న ప్రభ గుండెలోకి దూసుకెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భవానీపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుపై స్పదించడానికి పోలీసులు నిరాకరిస్తున్నారు. హోంగార్డుని భవానీపురం పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

కేసులో కొత్తకోణం..

క్షణికావేశంలో భార్యను బెదిరించే క్రమంలోనే తుపాకితో కాల్పలు జరిపినట్లు దర్యాప్తు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. గత అర్ధరాత్రి బంగారు నగలు తాకట్టు పెట్టిన విషయంలో భార్యతో గొడవ జరిగినట్లు పశ్చిమ మండల ఏసీపీ హనుమంతరావు మీడియాకు తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామన్నారు.

ఇదీ చదవండి:

దాచేపల్లి వద్ద ఆటో బోల్తా.. 10 మందికి గాయాలు

Last Updated : Apr 12, 2021, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.