ETV Bharat / city

తుళ్లూరు విశ్రాంత తహసీల్దార్ సుధీర్ బాబు పిటిషన్ కొట్టివేత - Retired Tehsildar of Tulluru Sudhir Babu case in high court

రాజధాని అమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారమై సీఐడి తనపై నమోదు చేసిన కేసును రద్దు చేయాలంటూ... తుళ్లూరు మండలం విశ్రాంత తహశీల్దార్ అన్నె సుధీర్ బాబు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్ ఈ మేరకు తీర్పు ఇచ్చారు.సీఐడీ నమోదు చేసిన కేసులో దర్యాప్తు కొనసాగించాల్సిందేనన్నారు.

Retired Tehsildar of Tulluru Sudhir Babu's petition was dismissed by high court
తుళ్లూరు విశ్రాంత తహసీల్దార్ సుధీర్ బాబు పిటిషన్ కొట్టివేత
author img

By

Published : Oct 22, 2020, 7:44 AM IST

రాజధాని అమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారమై సీఐడి తనపై నమోదు చేసిన కేసును రద్దు చేయాలంటూ... తుళ్లూరు మండలం విశ్రాంత తహశీల్దార్ అన్నె సుధీర్ బాబు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్ ఈ మేరకు తీర్పు ఇచ్చారు. సీఐడీ నమోదు చేసిన కేసులో దర్యాప్తు జరగాల్సిందేనన్నారు. ప్రాథమిక దశలో దర్యాప్తును నిలురించకూడదని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ వ్యవహారంపై లోతైన విచారణ జరపాల్సి ఉందని... పిటిషన్​ను కొట్టేయాలని పోలీసుల తరఫు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్ రెడ్డి చేసిన వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ఈ మేరకు తీర్పునిచ్చారు.

అసలేం జరిగింది..??

ఎస్సీ,ఎస్టీలకు చెందిన అసైన్డ్ భూములను కొందరికి కట్టబెట్టిన వ్యవహారంలో అప్పటి తహశీల్దార్ సుధీర్ బాబు కీలక పాత్ర పోషించారనే ఆరోపణతో అందిన ఫిర్యాదు ఆధారంగా... సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై నమోదు చేసిన కేసు కొట్టేయాలని సుధీర్ బాబు హైకోర్టును ఆశ్రయించగా.. దర్యాప్తుపై న్యాయస్థానం స్టే విధించింది. ఆ ఉత్తర్వుల పై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. సుధీర్ బాబు పిటిషన్​పై విచారణ జరిపి త్వరగా తేల్చాలని హైకోర్టును ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ ఇటీవల విచారణ జరిపి తీర్పు వెల్లడించారు.

రాజధాని నిమిత్తం ఆసైన్డ్ భూముల్ని ప్రభుత్వం తీసుకుంటే పరిహారం రాదని ఎస్సీలను నమ్మించి... వారి భూముల్ని పిటిషనర్ వేరే వారికి కట్టబెట్టారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. విచారణ ప్రాథమిక దశలో ఉందని, మరికొన్ని వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఆ వాదనలను న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకొని వ్యాజ్యాన్ని కొట్టేశారు.

ఇదీ చదవండి:

ఎస్​ఈసీ వ్యాజ్యంలో ప్రభుత్వం తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.