విజయవాడ నగరంలోని 61 వ డివిజన్ దేవినేని గాంధీ పురంలో పాయకాపురం చెరువు ఆక్రమణల తొలగింపునకు నగరపాలక సంస్థ, రెవెన్యూ అధికారులు శ్రీకారం చుట్టారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఉండాల్సిన చెరువులో సుమారుగా నాలుగు ఎకరాల మేర ఆక్రమణకు గురైందని అధికారులు నిర్ధరించినట్లు తెలిసింది. శుక్రవారం కార్పొరేషన్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా ఆక్రమణల తొలగింపునకు చర్యలు చేపట్టారు.
చెరువు వెంబడి ఉన్న 22 ఆక్రమణలను తొలగించి అక్కడ నివాసాలు ఏర్పరుచుకున్న వారికి పునరావాసం కింద జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లను కేటాయిస్తామని అధికారులు తెలిపారు. తొలగింపు పనులను నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, నార్త్ మండల తహసీల్దార్ దుర్గాప్రసాద్ పర్యవేక్షించారు.
ఇదీచదవండి