లాక్ డౌన్ సమయంలో కరోనాకు భయపడకుండా ప్రజలకు రేషన్ పంపిణీ చేసిన రేషన్ డీలర్లు… కరోనా బారిన పడి ఇప్పటి వరకు 25 మంది దాకా మృతి చెందారని… వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ… విజయవాడ పౌరసరఫరాల కార్యాలయం ఎదుట రేషన్ డీలర్లు ఆందోళనకు దిగారు. పాదయాత్ర సమయంలో జగన్… అధికారంలోకి వచ్చిన వెంటనే రేషన్ డీలర్లను ఆదుకుంటామని ఇచ్చిన హామీలు మాటలకే పరిమితం అయ్యాయని.. రేషన్ డీలర్ల సంఘం కార్యదర్శి శివప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన ప్రయోజనాలను సైతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రద్దు చేశారన్నారు. తక్షణమే ప్రభుత్వం రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించి, కరోనా బారినపడి మృతిచెందిన కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: