సైదాబాద్ హత్యాచార కేసులో నిందితుడు రాజు ఆత్మహత్య ఘటనతో తెలంగాణలోని సూర్యాపేట జిల్లా అడ్డగూడూరులోని అతని కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. పోలీసులే కాల్చి చంపేశారని నిందితుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు.
రాజును చంపి కడుపుకోత మిగిల్చారని తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాన్ని అప్పగించాలని రాజు తల్లి, భార్య కోరుతున్నారు. రాజు కోసం పోలీసులు గాలిస్తున్న సమయంలో ఈరోజు ఉదయం స్టేషన్‌ఘన్‌పూర్ సమీపంలో రైల్వేట్రాక్‌పై రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో మమ్మల్ని ఉంచారు. నిన్ననే వదిలి వేశారు. పోలీస్‌స్టేషన్‌లోనే ఆరు రోజులు ఉన్నాం. రాజు దొరికితేనే వదిలేస్తామని చెప్పారు. నిన్నటికి నిన్న ఏమైందో తెలియదు మమ్మల్ని ఉప్పల్‌లో రాత్రి 9 గంటలకు వదిలేశారు. ఏమైంది అని అడిగితే ఎన్కౌంటర్ అర్డర్ వచ్చింది చేసేస్తాం అని చెప్పారు. అప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నాం. చనిపోయిన అతను మా ఆయనే.. ఇప్పటి వరకు ఎవరూ ఫోన్ చేయలేదు. నిన్న పదిసార్లు పచ్చబొట్టు గురించి అడిగారు. నాతో మా ఆయన తాగకపోతే మంచిగానే ఉండే వాడు. ఆయన అట్ల చేయడు అనుకున్నాం...
- నిందితుడు రాజు భార్య
అడ్డగూడురులోనే పోలీసులు రాజును పట్టుకెళ్లారు. ఇప్పుడేమో ఆత్మహత్య అంటున్నారు. మా కొడుకు శవం అప్పగించండి. మూడు రోజుల కిందటే దొరికిండు అన్నారు. చంపేశారు కదా.. ఇంకేముంది.
- నిందితుడు తల్లి
10 వ తేదీ మా బంధువుల ఇంటికి వెళ్తుంటే.. పోలీసులు పట్టుకున్నారు. మీ తమ్ముడు చిన్నారిని రేప్ చేసి చంపేశాడు అని చెప్పారు. కానీ మేము నమ్మలేదు. రాజుకు చిన్నపిల్లలంటే ఇష్టం. సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ఉంచారు. నిన్న రాత్రికి రాత్రే వదిలేశారు. డబ్బులిచ్చి బస్సు ఎక్కించి పంపించారు.
- నిందితుడు అక్క
ఇదీ చూడండి:
Raju postmortem: ఎంజీఎం ఆస్పత్రికి రాజు కుటుంబసభ్యులు.. మృతదేహానికి శవపరీక్ష