హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదల నుంచి కోలుకోకముందే... నగరంలో వర్షం కురుస్తోంది. వర్షానికి రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిప్రాంతాల్లో... రోడ్లపైకి మోకాలి లోతు నీరు చేరింది. కార్యాలయాల నుంచి బయల్దేరే ఉద్యోగులు... తడుస్తూనే ఇళ్లకు వెళ్తున్నారు.
దిల్‌సుఖ్‌నగర్, వనస్థలిపురం, కొత్తపేట, మలక్‌పేట, కూకట్‌పల్లి, రాయదుర్గం, షేక్‌పేట, మదీనా, చార్మినార్, బహదూర్‌పురా, జూపార్క్, పురానాపూల్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. సరూర్‌నగర్, సైదాబాద్, చంపాపేట్, రామంతాపూర్, ఉప్పల్, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, మేడిపల్లి, మన్సూరాబాద్, నాగోల్, హయత్‌నగర్, బి.ఎన్.రెడ్డి ప్రాంతాల్లో వాన పడుతోంది. అంబర్‌పేట, కాచిగూడ, నల్లకుంట, విద్యానగర్, గోల్నాక ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది.
మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన లోతట్టు ప్రాంతాలు క్రమంగా కోలుకుంటున్నాయి. మళ్లీ వర్షం పడుతుండటంలో నగరవాసుల్లో ఆందోళన మొదలైంది.
భారీగా ట్రాఫిక్ జామ్..
ఎల్బీనగర్ వద్ద విజయవాడ జాతీయ రహదారిపై డివైడర్ పైనుంచి వరద నీరు పొంగిపొర్లుతోంది. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది.
ఇదీచదవండి