ETV Bharat / city

'దండలు వేయడమే కాదు.. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయాలి'

రాష్ట్రంలో రాజ్యంగం అమలు కావడం లేదని.. ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా.. ఆయన విగ్రహానికి దండలు వేయడం, దండం పెట్టుకోవడం మాత్రమే కాకుండా ఆయన రచించిన రాజ్యాంగాన్ని సైతం అమలు చేయాలని వ్యాఖ్యానించారు.

raghurama krishna raju on ysrcp govt
raghurama krishna raju on ysrcp govt
author img

By

Published : Apr 14, 2021, 5:47 PM IST

ఏపీలో ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. తన పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు వేయాలని.. గతంలో ఫిర్యాదు చేశారన్నారు. మాతృ భాష గురించి మాట్లాడిన తనను అనర్హుడిని చేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. సీఎం జగన్​కు బెయిల్‌ రద్దు చేయాలని తాను న్యాయస్థానంలో పిటిషన్‌ వేయడం.. పార్టీ నిబంధనలకు వ్యతిరేకమని, నియమావళిని ఉల్లంఘించానని చెప్పి మరొకసారి ఫిర్యాదు చేయనున్నారని తెలిపారు.

తనపై అనర్హత వేటు వేసే అవకాశమే లేదని రఘురామ స్పష్టం చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌.ఆంబేడ్కర్‌ అందరివాడని.. కొందరి వాడు కాదని చెప్పారు. అవకాశం ఉన్న ప్రతి చోట రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ విగ్రహాలు ఏర్పాటు చేయాలని కోరారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా.. ఆ మహనీయుడి విగ్రహానికి దండలు వేస్తూ.. దండాలు పెడుతున్నారని.. అయితే, ఆయన రాసిన రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి:

నీటి కుంటలో శవంగా తేలిన భర్త.. ఇంట్లో ఉరేసుకుని భార్య ఆత్మహత్య.. అసలేం జరిగింది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.