ETV Bharat / city

QR Code: ఇంటర్ పాఠ్య​ పుస్తకాల్లో కోడ్​ స్కాన్ చేస్తే.. వీడియో పాఠాలు

ఇంటర్‌మీడియట్‌ పాఠ్య పుస్తకాల్లో కూడా క్విక్‌ రెస్పాన్స్‌(క్యూఆర్‌) కోడ్‌ను ముద్రిస్తున్నారు. ఇప్పటివరకు 6-10 తరగతుల పాఠ్య పుస్తకాల్లోనే ఈ సౌలభ్యం ఉండగా దాన్ని ఇంటర్‌కూ విస్తరించారు. కాకపోతే ఇంటర్‌ పుస్తకాల్లో కోడ్‌ను స్కాన్‌ చేస్తే వీడియో పాఠాలు ప్రత్యక్షమవుతాయి.

QR Code: ఇంటర్ పాఠ్య​ పుస్తకాల్లో కోడ్​ స్కాన్ చేస్తే.. వీడియో పాఠాలు
QR Code: ఇంటర్ పాఠ్య​ పుస్తకాల్లో కోడ్​ స్కాన్ చేస్తే.. వీడియో పాఠాలు
author img

By

Published : May 29, 2021, 10:53 AM IST

క్యూఆర్‌ కోడ్‌(QR Code)తో కూడిన పుస్తకాలను తెలుగు అకాడమీ ముద్రిస్తోంది. ఇంటర్‌(INTER) ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లోని గణితం, భౌతిక, రసాయన, వృక్ష, జంతు శాస్త్రాల సబ్జెక్టుల్లోనే అమలు చేస్తున్నారు. రాష్ట్రంలోని 404 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వమే ఉచితంగా పాఠ్య పుస్తకాలను సరఫరా చేస్తోంది. ఆ కళాశాలల్లోని సైన్స్‌ గ్రూపుల విద్యార్థులకు క్యూఆర్‌ కోడ్‌ పుస్తకాలు అందుతాయి. దీనివల్ల దాదాపు లక్ష మంది ప్రయోజనం పొందుతారు. మరో వారం పది రోజుల్లో పుస్తకాలను తెలుగు అకాడమీ ముద్రించనుంది. ఇంటర్‌ విద్యాశాఖ నుంచి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదివే విద్యార్థుల వివరాలు అందిన తర్వాత కళాశాలలకు సరఫరా చేయనున్నారు.

ఒక్కో సబ్జెక్టుకు 80-90 వీడియో పాఠాలు

పాఠశాల తరగతుల పుస్తకాల కోసం రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) రూపొందించిన క్యూఆర్‌ కోడ్‌లను స్మార్ట్‌ ఫోన్‌ (Smart Phone) ద్వారా స్కాన్‌ చేస్తే పుస్తకంలోని అదనపు సమాచారం కనిపిస్తుంది. ఇంటర్‌ పుస్తకాల్లో మాత్రం సమాచారం కాకుండా వీడియోలు వస్తాయి. వాటిని మన టీవీ కోసం టీశాట్‌ తయారు చేసింది. ఒక్కో సబ్జెక్టుకు 80-90 వీడియో పాఠాలు ఉంటాయి.

ఇదీ చూడండి: Hanuman birth place: 'కిష్కింధలోనే ఆంజనేయుడు పుట్టాడు'.. 'కాదు..తిరుగిరుల్లోని అంజనాద్రిలోనే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.