ETV Bharat / city

శ్రీహరికోట నుంచి ఈ నెల 17న పీఎస్​ఎల్​వీ ప్రయోగం - latestnews PSLV launch on the 17th

వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలిస్తే భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీహరికోట నుంచి ఈనె 17న పొలార్ శాటిలైట్ లాంట్ వెహికిల్-సి 50 (పీఎస్​ఎల్​వీ) ప్రయోగాన్ని చేయాలని శాస్త్రవేత్తలు లక్ష్యంగా పెట్టుకున్నారు.

PSLV launch on the 17th
17న పీఎస్​ఎల్​వీ ప్రయోగం
author img

By

Published : Dec 9, 2020, 9:45 AM IST

వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలిస్తే...భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీహరికోట నుంచి ఈనె 17న పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్-సి 50 (పీఎస్​ఎల్​వీ) ప్రయోగాన్ని చేయాలని శాస్త్రవేత్తలు లక్ష్యంగా పెట్టుకున్నారు. వరుస తుపాన్ల నేపథ్యంలో ప్రయోగాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు. తొలుత ఈ నెల 2న పీఎస్​ఎల్​వీ-సి50 వాహక నౌకను అనుసంధాన భవనం నుంచి రెండో ప్రయోగ వేదికకు తీసుకొచ్చి 7న ప్రయోగం చేయాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఈ నెలలో 8వ తేదీన వరుస తుపాన్లు ఉండటంతో వాయిదా వేశారు. తర్వాత ఈ నెల 14న ప్రయోగం చేయాలని భావించారు. ఐదు రోజుల పాటు వాహకనౌకను ప్రయోగవేదికపై ఉంచి వివిధ పనులు చేయాలని భావించారు. ఈ సమయంలో తుపాన్లు వర్షాలు పడే అవకాశం ఉండటంతో 14న ప్రయోగం చేయటం వీలుపడదని భావించి 17వ తేదీకి వాయిదా వేశారు. దీని ద్వారా మనదేశానికి చెెందిన సీఎంఎస్-01 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు.

ఇదీ చదవండి:

యువతి శస్త్రచికిత్సకు ఉపరాష్ట్రపతి సాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.