ETV Bharat / city

ముగిసిన నామపత్రాల సమర్పణ - ఏపీలో స్థానిక పోరు వార్తలు

జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజక వర్గాలకు పోటీ చేసే అభ్యర్థుల నామపత్రాల సమర్పణ కార్యక్రమం ముగిసింది. 46 జడ్పీటీసీ స్థానాలకు 331 నామపత్రాలు,ఎంపీటీసీ స్థానాలకు 3671 మంది నామపత్రాలు దాఖలు చేశారు.

nominations concluded in krishna district

author img

By

Published : Mar 12, 2020, 9:27 AM IST

జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజక వర్గాలకు పోటీ చేసే అభ్యర్థుల నామపత్రాల సమర్పణ కార్యక్రమం పరిపూర్ణంగా ముగిసింది. మూడు రోజుల పాటు దాఖలుకు అవకాశం ఉన్నా చివరి రోజైన బుధవారం అభ్యర్థులు బారులుదీరారు. జడ్పీటీసీ స్థానానికి పత్రాలు సమర్పించేందుకు వచ్చిన అభ్యర్థులతో జిల్లా పరిషత్‌ ప్రాంగణం కోలాహలంగా మారింది.

దాఖలు చేయించిన ముఖ్య నేతలు

మంత్రులు పేర్ని వెంకట్రామయ్య, కొడాలి వెంకటేశ్వరరావు, పామర్రు ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌, డీసీఎంఎస్‌ ఛైర్మన్‌ ఉప్పాల రాంప్రసాద్‌లు గుడ్లవల్లేరు జడ్పీటీసీ స్థానానికి వైకాపా అభ్యర్థినిగా ఉప్పాల హారికతో నామపత్రం వేయించారు. మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు ఉంగుటూరు అభ్యర్థితో పాటు వచ్చారు. శాసనమండలి సభ్యుడు, తెదేపా జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు ఉదయం నుంచి జడ్పీలోనే ఉండి తమ పార్టీ అభ్యర్థులతో నామపత్రాలు దాఖలు చేయించారు. సీపీఐ జిల్లా నాయకురాలు అక్కినేని వనజ తమ పార్టీ అభ్యర్థులతో కలిసి వచ్చారు. ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు వచ్చిన నాయకులను, కార్యకర్తలను జడ్పీ ప్రాంగణం వెలుపలే పోలీసులు నిలిపివేశారు.

3671 మంది నామపత్రాల దాఖలు

ఎంపీటీసీ స్థానాల నామపత్రాల విషయంలో ఆఖరి రోజునే అభ్యర్థులు సంబంధిత మండల కార్యాలయాలకు బారులు తీరడంతో అక్కడి కూడా సందడి వాతావరణం అలుముకుంది. మొదటి రోజున జడ్పీటీసీ స్థానాలకు కేవలం ఇద్దరు మాత్రమే నామపత్రాలు వేయగా మంగళవారం 26 మంది వేశారు. చివరి రోజున 303 మంది నామపత్రాల సమర్పించడంతో మొత్తం 46 జడ్పీటీసీ స్థానాలకు 331 నామపత్రాలు దాఖలయ్యాయి. జిల్లాలోని 723 ఎంపీటీసీ స్థానాలకు మంగళవారం నాటికి 275 మంది నామపత్రాలు ఇచ్చారు. బుధవారం అత్యధిక సంఖ్యలో రావడంతో కొన్ని మండలాల్లో సమయం దాటిపోయాక కూడా స్వీకరించాల్సి వచ్చింది. సాయంత్రం 5 గంటలకు మిగిలిఉన్న అభ్యర్థులకు టోకెన్లు ఇచ్చారు. జిల్లా మొత్తం మీద ఎంపీటీసీ స్థానాలకు 3671 మంది నామపత్రాలు దాఖలు చేశారు.

జడ్పీటీసీ స్థానాలకు పార్టీపరంగా దాఖలైన నామినేషన్ల వివరాలు

పుర పోరుకు తొలిరోజు 16 నామపత్రాలు

పుర పోరులో కీలకఘట్టమైన నామపత్రాల సమర్పణ బుధవారం ప్రారంభమైంది. శుక్రవారంతో ముగిసే ఈ ప్రక్రియలో భాగంగా తొలిరోజు నామమాత్రపు స్పందన కన్పించింది. జిల్లాలో విజయవాడ, మచిలీపట్నం కార్పొరేషన్లతో పాటు పెడన, గుడివాడ, నూజివీడు, జగ్గయ్యపేట పురపాలక సంఘాలు, ఉయ్యూరు, నందిగామ, తిరువూరు నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. సాంకేతిక కారణాలతో గుడివాడ, జగ్గయ్యపేట పురపాలక సంఘాల ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే.

ఎన్నికలు నిర్వహిస్తున్న మిగిలిన వాటికి సంబంధించి నామపత్రాల స్వీకరణ మొదటి రోజున కేవలం 16 మంది మాత్రమే సమర్పించారు. విజయవాడ కార్పొరేషన్‌కు అత్యధికంగా 18 మంది అందచేశారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌గా తొలిసారి ఎన్నికలు ఎదుర్కొంటున్న మచిలీపట్నంలో ఏడు దాఖలయ్యాయి. ఉయ్యూరు, నందిగామ నగర పంచాయతీల్లో ఒక్కరు కూడా నామపత్రాలు వేయలేదు.

ఇదీ చదవండి : జిల్లా, మండల పరిషత్తు స్థానాలకు ముగిసిన నామినేషన్ల గడువు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.