ETV Bharat / city

కరోనా కష్టాలు...కూలీ పనులకు ప్రైవేటు ఉపాధ్యాయులు

విద్యాసంస్థల్లో బోధనే వృత్తిగా జీవనం సాగిస్తున్న ప్రైవేటు ఉపాధ్యాయుల జీవితాల్లో కరోనా పెనుదుమారం రేపింది. గత ఆరు నెలలుగా జీతాలు లేక ఆర్ధిక ఇబ్బందుల్లో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నారు. కుటుంబాలను పోషించుకోవడం కోసం ప్రత్యామ్నాయ ఉపాధి మార్గం వైపు అడుగులు వేస్తున్నారు.

కూలీ పనులకు ప్రైవేటు ఉపాధ్యాయులు
కూలీ పనులకు ప్రైవేటు ఉపాధ్యాయులు
author img

By

Published : Sep 21, 2020, 10:58 PM IST

కరోనా లాక్​డౌన్ కారణంగా గత 6 నెలలుగా పాఠశాలలు మూతపడటంతో ప్రైవేటు ఉపాధ్యాయుల జీవనం దుర్భరమైంది. ఇప్పటి వరకు పాఠశాలలు తెరుచుకోకపోవటంతో ఉపాధి కరువై...ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుపోతున్నారు. కుటుంబ పోషణ కోసం ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల వైపు చూస్తున్నారు.

కూలీలుగా మారి

బడిలో పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులకు..కరోనా బతుకు పాఠం నేర్పించింది. తననే నమ్ముకున్న కుటుంబాన్ని పోషించటం కోసం కూలీ పనులకు వెళ్లేలా చేసింది. కొందరు కూలీలుగా, తాపీ మేస్త్రీలుగా, మరికొంత మంది ప్రైవేటు ఉపాధ్యాయులు పండ్లు, కూరగాయాలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. ఉన్నత విద్యను అభ్యసించినప్పటికీ మనసు చంపుకొని కూలీ పనులకు వెళ్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

"బీఎస్సీ , బీఈడీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం రాక ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో గత పది పదిహేను సంవత్సరాల నుంచి పని చేస్తున్నాను. కరోనా మా జీవితాలను అతలాకుతలం చేసింది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన మేము.. మనసు చంపుకొని కూలీ పనులకు వెళ్తున్నాం. కుటుంబాన్ని పోషించుకోవటానికి మరోదారి కనిపించటం లేదు" -మల్లిక, ప్రైవేటు ఉపాధ్యాయురాలు

గత ఆరు నెలలుగా జీతాలు లేక సరైన పని దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నామని ప్రైవేటు ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

ఆర్థిక సాయం

కూలీ పనులకు వెళుతున్న ప్రైవేటు ఉపాధ్యాయలపై ఈనాడు-ఈటీవీ భారత్ పలు కథనాలు ప్రచురించింది. కథనాలకు మాజీ అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి స్పందించారు. కృష్ణా జిల్లా ముదినేపల్లిలోని ప్రైవేటు పాఠశాలలో పని చేస్తున్న ఆరుగురు ఉపాధ్యాయులకు తనవంతుగా కొంత నగదు సాయం చేసి... వారిని సన్మానించారు. ఇంకా ఎవరైనా ఆర్థిక ఇబ్బందులున్న ఉపాధ్యాయులు ఉంటే వారికీ సాయం చేస్తానని తెలిపారు.

ఇదీచదవండి

'ఏపీ పోలీస్‌ సేవ' యాప్ ఆవిష్కరించిన సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.