విజయవాడ నగరంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే కృష్ణా జిల్లా వ్యాప్తంగా 35 కేసులు నమోదు కాగా... అందులో 27 కేసులు నగరంలోనే నమోదయ్యాయి. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను రెడ్‌జోన్లుగా ప్రకటించి... ఆయా ప్రాంతాల్లో నగరపాలక సిబ్బంది.. నిరంతరం సోడియం హైడ్రోక్లోరైడ్ రసాయనాన్ని పిచికారీ చేస్తున్నారు. ఇప్పటి వరకూ పవర్ స్ప్రే ద్వారా పిచికారీ చేయగా... ఇప్పుడు బూమ్ స్ప్రే యంత్రాలు వినియోగిస్తున్నారు.
గన్నవరం నుంచి బూమ్ స్ప్రేయర్లను విజయవాడకు తీసుకొచ్చారు. సాధారణంగా మినుము, పత్తి, మిరప పంటల్లో మందు పిచికారీ చేయడం కోసం యంత్రాలను వినియోగిస్తుంటారు. బూమ్ స్ప్రే యంత్రం రెక్కలు 30 అడుగుల పొడవు ఉండటంతో.. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో మందు పిచికారీ చేసే అవకాశం కలుగుతోంది. 600 లీటర్ల సామర్థ్యం ఉన్న ఈ బూమ్ స్ప్రే.... గంటపాటు నిర్విరామంగా పనిచేస్తూ సగటున మూడు కిలోమీటర్ల పైనే పిచికారీ పూర్తిచేస్తోంది.
ఇప్పటికే నాలుగు యంత్రాలను అందుబాటులోకి వచ్చాయని... రెడ్ జోన్ ప్రాంతాల్లో సోడియం హైడ్రోక్లోరైడ్ పిచికారీకి ఉపయోగిస్తున్నామని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: