ETV Bharat / city

'సీఎం జగన్​కు చిత్తశుద్ధి ఉంటే మంత్రి వెల్లంపల్లిని బర్తరఫ్ చేయాలి'

అవినీతి రహిత పాలన అందిస్తానంటున్న సీఎం జగన్​కు చిత్తశుద్ధి ఉంటే మంత్రి వెల్లంపల్లిని బర్తరఫ్ చేయాలని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్ డిమాండ్ చేశారు. మంత్రి అవినీతి భాగోతం ప్రభుత్వం దృష్టికి వెళ్లినందునే దుర్గ గుడిలో అనిశా దాడులు జరుగుతున్నాయన్నారు.

సీఎం జగన్​కు చిత్తశుద్ధి ఉంటే మంత్రి వెల్లంపల్లిని బర్తరఫ్ చేయాలి

author img

By

Published : Feb 20, 2021, 3:37 PM IST

విజయవాడ దుర్గగుడిలో జరుగుతున్న అనిశా దాడులపై మంత్రి వెల్లంపల్లి ఎందుకు స్పందించటం లేదని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్ ప్రశ్నించారు. దుర్గగుడిలో మంత్రి కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. మంత్రి అవినీతి భాగోతం ప్రభుత్వం దృష్టికి వెళ్లినందునే అనిశా దాడులు జరుగుతున్నాయన్నారు. వెల్లంపల్లికి చిత్తశుద్ధి ఉంటే ఏ తప్పు చేయలేదని అమ్మవారిపై ప్రమాణం చేసి, మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పాలన్నారు.

దుర్గగుడి ఈవో సురేశ్ బాబు మంత్రి వెల్లంపల్లిని వెనకేసుకువస్తున్నారని విమర్శించారు. ఆలయంలోని పాత ఐరన్​ అమ్మకాల్లో అక్రమాలకు పాల్పడి మంత్రి కారును కొనుగోలు చేశారన్నారు. చీమకుర్తి గ్రానైట్ ఇండస్ట్రీస్​లో వెల్లంపల్లి రూ. 25 కోట్లు పెట్టుబడి పెట్టారని విమర్శించారు. మంత్రి బినామీ కొండపల్లి బుజ్జి కనుసన్నల్లోనే ఈ భాగోతం సాగుతోందన్నారు. అవినీతి రహిత పాలన అందిస్తానంటున్న సీఎం జగన్​కు చిత్తశుద్ధి ఉంటే మంత్రి వెల్లంపల్లిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీచదవండి...

ఏపీకి రూ.2,222.71 కోట్ల జీఎస్టీ పరిహారం విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.