ETV Bharat / city

బెజవాడ గ్యాంగ్​ వార్​పై లోతైన దర్యాప్తు - విజయవాడ తాజా వార్తలు

విజయవాడ గ్యాంగ్ వార్ కేసును పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఓ అపార్ట్‌మెంట్ సెటిల్​మెంట్ విషయంలో ఇరు వర్గాలు కొట్లాటకు దిగినట్లు... దానికి కారణం ఒక స్థిరాస్తి వ్యాపారి అయినట్లు తేల్చారు. అయితే.. పండు, సందీప్‌ గ్యాంగ్‌లను నడిపేందుకు ఎంత ఖర్చు చేస్తున్నారు? డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే విషయాల్ని పోలీసులు ఆరా తీస్తున్నారు.

police-investigation-on-vijayawada-gang-war
police-investigation-on-vijayawapolice-investigation-on-vijayawada-gang-warda-gang-war
author img

By

Published : Jun 4, 2020, 8:19 AM IST

విజయవాడలో జరిగిన గ్యాంగ్‌వార్‌ కేసును మరింత లోతుగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సినిమాల్లో మాదిరిగా గ్యాంగ్‌లను నడిపేందుకు వీరికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే విషయంపై ఆరా తీస్తున్నారు. గ్యాంగ్‌ల నిర్వహణ కోసం ఎంత ఖర్చు చేస్తుంటారు. ఈ గ్యాంగ్‌లతో ఎలాంటి పనులకు పాల్పడుతుంటారనే దానిపైనా దృష్టిపెట్టారు. మొదటి పంచాయితీ విషయంలోనే వీరికి గొడవ జరిగిందా? లేక గతంలో ఇలాంటి పంచాయితీలు ఏవైనా చేశారా? అనే విషయాలపై కూపీ లాగుతున్నారు. తాజాగా జరిగిన గ్యాంగ్‌ వార్‌లో పక్కనే ఉన్న మంగళగిరి నుంచి సైతం కొందరొచ్చి పాల్గొనడంతో.. ఇంకా ఇలాంటి వారి ప్రమేయం ఏమైనా ఉందేమోనని ఆరా తీస్తున్నారు. దీనికోసం నిందితుల కాల్‌ రికార్డులు, సోషల్‌మీడియా ఖాతాల్లోని వివరాలను సేకరిస్తున్నారు.

సందీప్‌, పండు ఇద్దరి గ్యాంగ్‌లో ఉన్న పాతిక మంది వరకూ ఇప్పటికే అదుపులోనికి తీసుకున్నారు. వీరిలో ఒక గ్యాంగ్‌కు చెందిన 12మంది, మరో గ్యాంగ్‌కు చెందిన 13మంది ఉన్నట్టు తెలిసింది. మరికొందరు నిందితులు కూడా ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసును విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు తీవ్రంగా పరిగణించడంతో ఆరు బృందాలు వేర్వేరుగా గాలింపు చర్యలను చేపట్టాయి. అదుపులోకి తీసుకున్న నిందితులను పోలీసులు వేర్వేరు చోట్ల రహస్యంగా విచారిస్తున్నారు. ఘర్షణకు కారణాలు, కొట్లాటకు ముందు ఏం జరిగింది.. ఎప్పటి నుంచి వీరిద్దరి మధ్య వైరం ఏర్పడింది.. వంటివి తెలుసుకుంటున్నారు. కత్తులు, రాడ్లతో భయానక వాతావరణం సృష్టించిన రెండు గ్యాంగుల్లోని సభ్యులపై రౌడీషీట్‌ తెరిచే ఆలోచనలో పోలీసులున్నారు. మరో రెండు రోజుల్లో కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

తాజా ఘర్షణకు కారణం అతడే..

పండు, సందీప్‌ మధ్య చాలాకాలంగా వివాదాలు ఉన్నా.. తాజాగా గ్యాంగ్‌వార్‌ వరకూ వెళ్లడానికి మాత్రం పెనమలూరు సెటిల్‌మెంటే కారణం. ఈ సెటిల్‌మెంట్‌కు తెరతీసిన వ్యక్తి నాగబాబు. ఇతను రియల్‌ఎస్టేట్‌తో పాటూ ఇతర వ్యాపారాలు కూడా చేస్తుంటాడు. వివాదాల్లో ఉన్న అపార్ట్‌మెంట్‌లు, స్థలాల వివరాలను సేకరించి.. వాటిని పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ సెటిల్‌మెంట్ల కోసం ఎదుటి వారిని భయపెట్టేందుకు స్థానికంగా తనకు తెలిసిన కుర్రాళ్ల గ్యాంగ్‌లను వాడుతున్నట్టు తెలిసింది. తాజాగా పెనమలూరుకు చెందిన అపార్ట్‌మెంట్‌ విషయం అతని వద్దకు రావడంతో.. కాస్త ఎక్కువగా డబ్బులు వస్తాయని భావించి రంగంలోనికి దిగాడు. తనకు తోడుగా సందీప్‌, పండులను సెటిల్‌మెంట్‌ కోసం తీసుకెళ్లాడు. ఇక్కడే ఇద్దరి మధ్య నువ్వెంతంటే.. నువ్వెంతనే స్థాయిలో ద్వేషం పెరిగి.. గ్యాంగ్‌వార్‌కు దారితీసింది. నాగబాబును అదుపులోనికి తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నారు. గతంలో చేసిన సెటిల్‌మెంట్ల విషయంపైనా దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

బెజవాడలో అలాంటి సంఘటనలు జరగకుండా చూస్తాం: డీజీపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.