విజయవాడలోని శివప్రసాద్ అనే వ్యక్తి కదల్లేని స్థితిలో ఉన్నాడు. ఆయన భార్య కుమారి సాయం కోసం ఎంతోమంది దగ్గరకు కాళ్లరిగేలా తిరిగారు. స్పందన లేక ఆశలు ఆవిరయ్యాయి... ఇక చావే శరణ్యమని... ఇదే ఆఖరి క్షణమంటూ కాలమెళ్లదీస్తోంది ఆ కుటుంబం. ఈ విషయం తెలుసుకున్న విజయవాడ పశ్చిమ జోన్ పోలీసులు స్పందించారు. భాధిత కుటుంబానికి వారి వంతు సాయం చేశారు. మేమున్నామంటూ కొండంత భరోసానిచ్చారు. బాధిత కుటుంబానికి ధైర్యాన్ని నింపి స్పూర్తిధాతలయ్యారు.
ఇదీ చదవండి:25 బుల్లెట్ బైకుల సైలెన్సర్లు పీకేశారు.. ఎందుకంటే!