ETV Bharat / city

ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ తొలిదశ నిర్మాణంపై నీలినీడలు - పోలవరం ప్రాజెక్టు తాజా వార్తలు

పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ తొలిదశ నిర్మాణంపై నీలినీడలు కముకున్నాయి. గత ఏడాది ఆగస్టులో వచ్చిన భారీ వరద... ఈసీఆర్​ఎఫ్ డ్యామ్ నిర్మించాల్సిన చోట ఇసుకను లాక్కెళ్లిపోయింది. మొత్తం 400 మీటర్ల మేర ఉన్న ప్రాంతంలో ఇసుక కోతకు గురైనట్టు... కేంద్ర జల సంఘంలోని డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ పేర్కొంది. ఈసీఆర్​ఎఫ్ పనులు ప్రారంభించేందుకు ఇసుక కోత అడ్డంకిగా మారింది.

ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ తొలిదశ నిర్మాణంపై నీలినీడలు

author img

By

Published : Apr 13, 2021, 4:45 AM IST

గత ఏడాది ఆగస్టులో గోదావరికి వచ్చిన వరద... పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మించాల్సిన చోట ఇసుక కోత ఏర్పడటంతో, పనులు నిలిచిపోయాయి. పోలవరం ప్రధాన డ్యామ్ నిర్మించాల్సిన ప్రదేశంలో దాదాపుగా 20 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక, మట్టి కొట్టుకుపోయినట్టు గుర్తించారు. ఇప్పుడేం చేయాలో తెలియక కేంద్ర జలసంఘంలోని డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ తల పట్టుకుంటోంది.

ఇసుక కొట్టుకుపోయి మరోచోట గుట్టలా పేరుకుపోయింది. దీనివల్ల దాదాపు 400 మీటర్ల ప్రాంతం దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. గతంలో ఎగువ కాఫర్ డ్యామ్ నిర్మాణ సమయంలో వరద ఉధృతికి మట్టి కొట్టుకుపోకుండా... 900 మీటర్ల మేర నీరు వెళ్లేలా ఏర్పాటుచేశారు. అయితే గత ఏడాది వరద వచ్చినప్పుడు... సెకనుకు 13 మీటర్ల వేగంతో నది ప్రవహించడం వల్ల ఇసుక కొట్టుకుపోయింది. ప్రధాన డ్యామ్‌ నిర్మాణంలో భాగంగా నది మధ్యభాగంలో 17 వందల 50 మీటర్ల మేర రాయి, మట్టితో అడ్డుకట్ట నిర్మించాల్సి ఉంది.

అయితే మొదటి దశలో 500 మీటర్ల పనులు చేపట్టాల్సిన చోట ఇసుక కోతకు గురైంది. దీనివల్ల ఇప్పటికిప్పుడు పనులు చేపడితే డ్యామ్ పటిష్టతపై రాజీ పడాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో ఇసుక కోతకు గురైన ప్రాంతాల్లో ఎలాంటి చర్యలు చేపట్టాలన్న దానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. 20 లక్షల క్యూబిక్ మీటర్ల మేర ఇసుక, మట్టి కొట్టుకుపోవడంతో.... తిరిగి మట్టి, ఇసుక పోసి గట్టిపర్చాలనే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.

ఇదీ చదవండి: వైకాపా ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయమైంది: జేపీ నడ్డా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.