సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు నిత్యం 1.80 లక్షల నుంచి 2 లక్షల మంది ప్రయాణికులు వస్తుంటారు. వీరికి వీడ్కోలు పలికేందుకు మరో 50 వేల మంది వరకు వస్తుంటారని దక్షిణ మధ్య రైల్వే రైల్వేశాఖ లెక్కలు వేసింది. ప్రజలు అధికంగా ఉండే ప్రాంతాల్లో కరోనా వైరస్ సునాయసంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండడం వల్ల ప్లాట్ ఫాం టికెట్ ధర పెంచాలని అధికారులు నిర్ణయించారు.
ప్రస్తుతం ప్లాట్ ఫాం టికెట్ ధర 10 రూపాయలుగా ఉంది. రూ.50కు పెంచితే వీడ్కోలు పలికేందుకు వచ్చే వారిని నిరోధించే అవకాశముంటుందన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ టికెట్ ధర పెంచితే.. కాచిగూడ, హైదరాబాద్ రైల్వే స్టేషన్లలో కూడా పెంచే అవకాశాలున్నాయి.