ETV Bharat / city

ఇంద్రకీలాద్రిపై యథేచ్ఛగా ప్లాస్టిక్ వినియోగం

బెజవాడను ప్లాస్టిక్ రహితంగా తయారు చేయాలంటూ... చేపట్టిన ఉద్యమం ప్రకటనలకే పరిమతమైంది. ఇంద్రకీలాద్రిపై పూజా సామాగ్రి విక్రయించే దుకాణాల్లో ఎటు చూసినా..ప్లాస్టిక్ సంచులే దర్శనమిస్తున్నాయి. ప్లాస్టిక్ సంచులను నిషేధిస్తామంటూ ఆలయ అధికారులు చేసిన వాగ్దానాలను అపహస్యం చేస్తున్నాయి.

ఇంద్రకీలాద్రిపై యథేచ్ఛగా ప్లాస్టిక్ వినియోగం
author img

By

Published : Nov 13, 2019, 3:40 PM IST

ఇంద్రకీలాద్రిపై పర్యావరణానికి హానిచేసే ప్లాస్టిక్‌ సంచులను నిషేధిస్తున్నామంటూ ఆలయ అధికారులు చేసిన ప్రకటనలు మాటలకే పరిమితమయ్యాయి. కొండపై పూజా సామగ్రి విక్రయించే దుకాణాల్లో మాత్రం ఎటు చూసినా ప్లాస్టిక్‌ సంచులే దర్శనమిస్తున్నాయి.

గత నెల 20 నుంచి ఇంద్రకీలాద్రిపై ప్లాస్టిక్‌ సంచులను నిషేధిస్తున్నామని తెలిపిన ఆలయ అధికారులు... తదనుగుణంగా విస్తృత ప్రచారమూ చేశారు. విజయవాడలో ఒక్కసారి వాడిపారేసే ప్లాస్టిక్ సంచులను వ్యాపారస్తులందరూ నిషేధించగా ఇంద్రకీలాద్రిపై మాత్రం ఇది అమలు కావట్లేదు.

దుర్గామల్లేశ్వర దేవస్థానానికి భక్తులు నిత్యం వేల సంఖ్యలో తరలివస్తుంటారు. పండుగ వేళల్లో భక్తుల తాకిడి మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇంద్రకీలాద్రిపై ప్లాస్టిక్ నిషేధం తప్పని సరి చేస్తూ... అధికారులు ప్రకటన జారీ చేశారు. కొండపైకి ప్లాస్టిక్‌ సంచులు తీసుకొస్తే జరిమానా తప్పదని హెచ్చరించినా... ప్లాస్టిక్‌ వినియోగం మాత్రం అదుపులోకి రావట్లేదు.

ఆలయ ప్రాంగణంలో ఎటు చూసినా భక్తుల చేతుల్లో ప్లాస్టిక్‌ సంచులే దర్శనమిస్తున్నాయి. పూజా సామగ్రి విక్రయించే దుకాణాల్లో ప్లాస్టిక్‌ సంచులు గుట్టలుగుట్టలుగా దర్శనమిస్తున్నా... అధికారులు చోద్యం చూస్తున్నారే తప్ప చర్యలు తీసుకోవట్లేదు. పర్యావరణహితమైన నార సంచులు అక్కడకక్కడే కనిపిస్తున్నాయి. అవీ అరకొరగానే అందుబాటులో ఉంటున్నాయి.

ఇంద్రకీలాద్రిపై యథేచ్ఛగా ప్లాస్టిక్ వినియోగం

ఇదీచదవండి

వేల ఏళ్లుగా.. పైకప్పు లేకుండానే.. త్రినేత్రుడి దర్శనం!

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.