విజయవాడ సిద్ధార్ధ ఆడిటోరియంలో పిన్నమనేని సీతాదేవి ఫౌండేషన్ పురస్కార కార్యక్రమం నిర్వహించారు. సామాజికవేత్త సింధుబాయి సత్కాల్, సంస్కృతంలో సేవలు అందించిన రామకృష్ణను సత్కరించారు. తాను చిన్ననాటి నుంచి మక్కువతో చదివిన సంస్కృతం తనను ఉన్నత స్థాయికి చేర్చిందని డా. రామకృష్ణ తెలిపారు. ఈ పురస్కారం లభించటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ పురస్కారం అందుకున్న సింధుబాయి... తనకు సాయం చేస్తే ఇంకా ఎంతో మంది అనాథలను పెంచుతానని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం 1400 మంది అనాథలను ఆమె అక్కున చేర్చుకున్నారు. 29ఏళ్లుగా పురస్కారాల ప్రదానం నిర్వహిస్తున్నట్లు సీతాదేవి ఫౌండేషన్ వెల్లడించింది.
ఇదీ చదవండి :