గుంటూరులో తెదేపా కార్యాలయానికి భూ కేటాయింపుపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పైన.. సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. నీటి వనరులున్నా.. భూ కేటాయింపులో నిబంధనలు ఉల్లంఘించారని ఆళ్ల పిటిషన్లో పేర్కొన్నారు. ఆయన.. ఆలస్యంగా పిటిషన్ వేశారని హైకోర్టు గతంలో వ్యాజ్యాన్ని కొట్టేసింది.
ఆ కొట్టివేత ఆదేశాలను పక్కనపెట్టిన జస్టిస్ ఆర్.ఎఫ్.నారీమన్ నేతృత్వంలోని ధర్మాసనం.. మెరిట్స్ ఆధారంగా పిటిషన్పై విచారణ జరపాలని హైకోర్టుకు సుప్రీం సూచనలు జారీ చేసింది. హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్ దాఖలుకు 2 వారాల గడువు ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. రీజాయిండర్ వేసేందుకు మరో వారం గడువు ఇవ్వాలని.. 4 నెలల్లో హైకోర్టు నిర్ణయం తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది.
ఇదీ చదవండి: