రాష్ట్రంలో కరోనా బాధితులు పెరుగుతున్నందున రోజుకు 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ...హైకోర్టులో పిల్ దాఖలైంది. గుంటూరుకు చెందిన డాక్టర్ పి.సుబ్రహ్మణ్య శాస్త్రి ఈ వ్యాజ్యం దాఖలుచేశారు. కేంద్రం జోక్యం లేకుండా రాష్ట్రానికి నేరుగా వ్యాక్సిన్ సరఫరా చేసేలా సీరం ఇనిస్టిట్యూట్, భారత్ బయోటెక్ సంస్థలను ఆదేశించాలని అభ్యర్థించారు. ఉత్పత్తిదారుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా రెమ్డిసివర్ సహా ఇతర ఔషధాల్ని కొనేందుకు వీలు కల్పించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలన్నారు.
రాష్ట్రంలో లక్షా 85 వేల కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని, సగటున రోజుకు 20 వేల కేసులు నమోదవుతున్నాయని గుర్తుచేశారు. కేంద్రం విధించిన పరిమితులతో ఆక్సిజన్, ఔషధాలు సరిపోవడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సీరం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, భారత్ బయోటెక్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ను వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు.
ఇదీచదవండి