ETV Bharat / city

Physical Fitness Tests: మహిళా పోలీసు ఉద్యోగాలకు ఇకపై శారీరక సామర్థ్య పరీక్షలు - ap latest news

Physical fitness tests for women police jobs: రాష్ట్రంలో ఇకపై ‘మహిళా పోలీసు’ ఉద్యోగాలకు ఎంపిక కావాలంటే నిర్దేశిత శారీరక కొలతలు కలిగి ఉండటంతో పాటు.. శారీరక సామర్థ్య పరీక్షల్లో కచ్చితంగా అర్హత సాధించాల్సిందే. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ మహిళా పోలీసు (సబార్డినేట్‌) సర్వీసు నియమావళి-2021ని.. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఖరారు చేసింది. ఇకపై నియామక ప్రక్రియ అంతా రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి చేపడుతుందని పేర్కొంది.

Physical fitness tests women police jobs in andhra pradesh
మహిళా పోలీసు ఉద్యోగాలకు ఇకపై శారీరక సామర్థ్య పరీక్షలు
author img

By

Published : Jan 13, 2022, 8:14 AM IST

Physical fitness tests for women police jobs: రాష్ట్రంలో ఇకపై ‘మహిళా పోలీసు’ ఉద్యోగాలకు ఎంపిక కావాలంటే నిర్దేశిత శారీరక కొలతలు కలిగి ఉండటంతో పాటు.. శారీరక సామర్థ్య పరీక్షల్లో కచ్చితంగా అర్హత సాధించాల్సిందే. దీనిలో అర్హత సాధిస్తేనే తుది రాత పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుంది. అభ్యర్థినులు డిగ్రీ విద్యార్హతతో పాటు నోటిఫికేషన్‌ విడుదల చేసే సంవత్సరంలో జులై ఒకటో తేదీ నాటికి 18-28 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి. ఈ నియామకాల్లో హోంగార్డులకు 5 శాతం, గ్రామ, వార్డు వాలంటీర్లకు 5 శాతం రిజర్వేషన్‌ ఉంటుంది. వారిలో అర్హులు లేకపోతే సాధారణ అభ్యర్థుల నుంచే ఎంపిక చేస్తారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ మహిళా పోలీసు (సబార్డినేట్‌) సర్వీసు నియమావళి-2021ను.. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఖరారు చేసింది. ఇకపై నియామక ప్రక్రియ అంతా రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి చేపడుతుందని పేర్కొంది.

20 నిమిషాల్లో 2కి.మి.నడక పరీక్ష పూర్తి చేయాల్సిందే

  • అభ్యర్థినులు 5 అడుగులు కంటే తక్కువ ఎత్తు, 40 కిలోల కంటే తక్కువ బరువు ఉండకూడదు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన గిరిజన మహిళలైతే 148 సెం.మీ.కంటే తక్కువ ఎత్తు, 38 కిలోల కంటే తక్కువ బరువు ఉండకూడదు.
  • శారీరక సామర్థ్య పరీక్షలో భాగంగా 20 నిమిషాల్లో 2 కి.మీ. నడక పూర్తి చేయాలి.
  • 200 మార్కులకు తుది రాత పరీక్ష ఉంటుంది.
  • ఎంపికైన వారికి మూడు నెలల పాటు శిక్షణ ఉంటుంది. తర్వాత క్షేత్రస్థాయి శిక్షణ కోసం నెల రోజుల పాటు ఒక పోలీసు యూనిట్‌లోనూ, అదీ పూర్తి చేసుకున్న తర్వాత మహిళలు, చిన్నారుల సమస్యలపై పనిచేసే ఎన్జీవోతో కలిసి వారం రోజులు విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

మహిళా పోలీసులు పదోన్నతి పొందాలంటే..

గ్రామ, వార్డు సచివాలయ మహిళా కార్యదర్శులుగా 2019లోనూ ఆ తర్వాత నియమితులైన వారిని మహిళా పోలీసులుగా పరిగణిస్తారు. పోలీసు శాఖలో ఇది ప్రత్యేక విభాగంగా ఉంటుంది. వారికి పదోన్నతి కల్పించేందుకు ఛానల్‌ ఏర్పాటు చేశారు. మహిళా పోలీసులకు సీనియర్‌ మహిళా పోలీసులుగా, సీనియర్‌ మహిళా పోలీసులకు ఏఎస్సై లుగా, ఏఎస్సైలకు ఎస్సైలుగా, ఎస్సైలకు ఇన్‌స్పెక్టర్‌గా (నాన్‌ గెజిటెడ్‌)గా పదోన్నతి కల్పిస్తారు. అయితే వీరు పోలీసు నియామక మండలి నిర్వహించే పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఆ పరీక్షలో వచ్చే మార్కులకు 90 శాతం వెయిటేజీ ఇస్తారు. పనితీరు మదింపు నివేదికలకు 10 శాతం వెయిటేజీ ఉంటుంది. నిర్దేశించిన సర్వీసు పూర్తి చేసుకోవటంతో పాటు, వెయిటేజీ ప్రకారం సాధించే మార్కులు ఆధారంగా పదోన్నతి లభిస్తుంది.

  • మహిళా పోలీసు హోదాలో ఆరేళ్లు సర్వీసు పూర్తయితే సీనియర్‌ మహిళా పోలీసుగా పదోన్నతి పొందేందుకు అర్హత లభిస్తుంది.
  • సీనియర్‌ మహిళా పోలీసులు పదోన్నతి పొందాలంటే ఆయా దశల్లో అయిదేసి ఏళ్లు చొప్పున సర్వీసు పూర్తి చేయాలి. ఈ మేరకు హోంశాఖ ఇన్‌ఛార్జీ ముఖ్య కార్యదర్శి జి.విజయ్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులిచ్చారు.

ఇదీ చదవండి:

AP Employees JAC Meeting: నేడు ఫాప్టో ఆధ్వర్యంలో ఉద్యోగుల ఐక్య వేదిక భేటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.