విద్యుత్ ఉన్నతాధికారులతో పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ ప్రతినిధుల భేటీ అయ్యారు. విజయవాడ విద్యుత్ సౌధలో వారి సమావేశం జరిగింది. జెన్‌కో రుణాల వడ్డీ బకాయిలపై అధికారులతో చర్చలు జరిపారు. నవంబర్ 5నాటి లేఖను ఆర్ఈసీ ప్రతినిధులు సమావేశంలో ప్రస్తావించారు. జెన్‌కో, ఏపీపీడీసీ రూ.546 కోట్లు బకాయిలు ఉన్నాయని.. జెన్‌కో, ఏపీపీడీసీ నిరర్ధక ఖాతాలుగా మారాయని ఆర్ఈసీ లేఖలో పేర్కొంది. ఈ తరహా ఎన్‌పీఏలను ఆర్బీఐ పర్యవేక్షిస్తోందన్న ఆర్ఈసీ.. బకాయిల ఎగవేత ఆర్థిక విశ్వసనీయతను దెబ్బతీస్తోందని అభిప్రాయపడింది.
రుణ ఒప్పందాలు కావాలనే ఉల్లంఘించినట్టుగా భావిస్తున్నామన్న ఆర్ఈసీ.. ఈ పరిస్థితులు రుణాలు వెనక్కి తీసుకునేలా ప్రేరేపిస్తున్నాయంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే పరిస్థితులు ఉన్నాయని.. బకాయిలు చెల్లించకుంటే తీవ్ర చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. రుణాలు వెనక్కి తీసుకోవాల్సి వస్తుందని తెలిపింది.
ఇదీ చదవండి: రాష్ట్రానికి పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ ప్రతినిధుల బృందం..జెన్‌కోకు ఇచ్చిన రుణ బకాయిలపై సీఎస్‌తో చర్చ !