జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసేలా ఎస్ఈసీని ఆదేశించాలని కోరుతూ.. పలువురు హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎస్ఈసీ సెలవుపై వెళ్లే యోచనలో ఉన్నారని తద్వారా పరిషత్ ఎన్నికల నిర్వహణ ఆలస్యమయ్యే అవకాశముందని పిటీషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఎస్ఈసీని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.
ఇదీచదవండి