గుంటూరులో తెదేపా కార్యాలయానికి భూ కేటాయింపుపై వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. భూ కేటాయింపులో సీఆర్‌డీఏ చట్టం నిబంధనలు ఉల్లంఘించారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. కేసులో తుది వాదనలను గురువారం వింటామన్న జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్..తదుపరి విచారణ ఈ నెల 15కి వాయిదా వేశారు.
ఇదీచదవండి
తిరుపతిలో తెదేపా గెలిస్తేనే జగన్ అరాచకాలు తగ్గుతాయి: చంద్రబాబు