పరిపాలన వికేంద్రీకరణ- మూడు రాజధానులు, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లులను రాష్ట్ర శాసనసభ మెున్నటి సమావేశాల్లో ఆమోదించింది. గతంలోనూ ఈ బిల్లులను శాసనసభ ఆమోదించినా, మండలి వ్యతిరేకించింది. వాటిని సెలెక్ట్ కమిటీలకు పంపాలని కోరింది. నాటి గందరగోళం మధ్యే బిల్లుల్ని సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు మండలి ఛైర్మన్ ఎం.ఎ.షరీఫ్ ప్రకటించారు. ఇది కోర్టుకు కూడా వెళ్లింది. ఈ నేపథ్యంలో.. మళ్లీ అవే బిల్లుల్ని యథాతథంగా శాసనసభలో ప్రవేశపెట్టి ప్రభుత్వం ఆమోదించింది. అయితే సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లుపై ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇదీ చదవండి: గవర్నర్తో సీఎం జగన్ భేటీ.. తాజా పరిస్థితులపై చర్చ