13 జిల్లాల్లోనూ 6 వేల కొత్త అంగన్వాడీ భవనాలను నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతిస్తూ ఆదేశాలిచ్చింది. గ్రామీణ ఉపాధి హామీ నిధుల అనుసంధానంతో అంగన్వాడీ కేంద్రాలను నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని ఉత్తర్వుల్లో తెలిపింది. ప్రతి అంగన్వాడీ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెండు లక్షలు, కేంద్ర ప్రభుత్వ గ్రాంటుగా 2 లక్షల చొప్పున అలాగే ఒక లక్ష రూపాయల చొప్పున నరేగా నిధులు వెచ్చించేలా చూడాలని పంచాయితీరాజ్ శాఖ కమిషనర్‌కు ప్రభుత్వం సూచించింది.
వివిధ జిల్లాల వారీగా భవనాల సంఖ్య వివరాలు కింది విధంగా ఉన్నాయి.
క్రమ సంఖ్య | జిల్లాల పేర్లు | భవనాల సంఖ్య |
1 | శ్రీకాకుళం జిల్లా | 317 |
2 | విశాఖ జిల్లా | 437 |
3 | విజయనగరం | 357 |
4 | తూర్పుగోదావరి జిల్లా | 557 |
5 | పశ్చిమగోదావరి జిల్లా | 517 |
6 | కృష్ణా జిల్లా | 557 |
7 | గుంటూరు జిల్లా | 597 |
8 | ప్రకాశం జిల్లా | 317 |
9 | నెల్లూరు జిల్లా | 397 |
10 | కర్నూలు జిల్లా | 557 |
11 | కడప జిల్లా | 397 |
12 | అనంతపురం జిల్లా | 477 |
13 | చిత్తూరు జిల్లా | 516 |
14 | మెుత్తం | 6000 |
ఇవీ చదవండి