క్రిప్టో కరెన్సీ వ్యవహారంలో పోలీసులు లోతైన విచారణ చేయాలని.. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం శివాపురం సర్పంచి లక్ష్మణరావు కోరారు(Shivapuram Sarpanch in crypto currency case). ఈ వ్యవహారంలో ఖమ్మం నగరానికి చెందిన రామలింగ స్వామి.. సూర్యాపేటలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఖమ్మం నగరానికి చెందిన రామలింగ స్వామి, గుడివాడకు చెందిన నరేష్, రామచంద్రపురానికి చెందిన నందకిషోర్.. ముగ్గురూ కలిసి నకిలీ వాలెట్ యాప్లను తయారు చేశారని లక్ష్మణరావు తెలిపారు.
నందిగామ మండలం జొన్నలగడ్డ గ్రామానికి చెందిన బాబి అనే మిత్రుని ద్వారా.. క్రిప్టో కరెన్సీలో రూ.70 లక్షలు పెట్టుబడి పెట్టాను. మొదటి 45 రోజులు ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఆ తర్వాత రూ.11 లక్షల చెక్కు, ఆరు లక్షల నగదు, మరోమారు రూ.10 లక్షల నగదు ఇచ్చారు. మిగిలిన సొమ్ము ఇవ్వకపోవడంతో రామలింగస్వామిపై ఒత్తిడి తీసుకువచ్చాను. ఈ విషయమై అక్టోబర్ 23న పెనుగంచిప్రోలులోని వసంత విహార్ గార్డెన్ లో.. రామలింగ స్వామి, నందకిషోర్, నరేష్ లతో చర్చలు జరిగాయి. ఆ రోజు రూ.10 లక్షలు నగదు ఇచ్చారు. నరేష్ కు చెందిన కియో కారు నా పేరు పైకి మార్చారు. దీంతో పాటు రూ.3లక్షల విలువ గల బంగారం, మరో కారు స్వచ్ఛందంగా ఇచ్చి వెళ్లారు. నవంబర్ 10న డబ్బంతా చెల్లిస్తామని చెప్పారు. నవంబర్ 12న జగ్గయ్యపేట వచ్చి నా అకౌంట్లో రూ.14 లక్షలు జమ చేశారు. అదే రోజు జగ్గయ్యపేట సీఐని కలిసి వ్యాపారం గురించి చెప్పాం. పెనుగంచిప్రోలు వెళ్లి ఫిర్యాదు చేసుకోవాలని సీఐ సూచించడంతో.. అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేశాను. తెలంగాణలోని సూర్యాపేట లాడ్జిలో రామలింగ స్వామి ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన రాసిన సూసైడ్ నోట్ లో తన పేరు కూడా ఉందని అక్కడ పోలీసులు ఫోన్ చేసి చెప్పారు.రామలింగ స్వామి ఆత్మహత్యకు తాను కారణం కాదని, తనకు కేవలం రూ.7.50లక్షలు మాత్రమే రావాల్సి ఉందని, ఆ డబ్బుల కోసం తానేమి తీవ్రంగా ఒత్తిడి చేయలేదు. ఈ కేసులో పోలీసులు పూర్తిస్థాయి విచారణ చేయాలి.
- లక్ష్మణరావు, శివాపురం సర్పంచి
ఇదీ చదవండి:
CM Jagan Meeting with YSRC MPs : 'ఆ అంశాల్లో కేంద్రాన్ని నిలదీయాలని సీఎం జగన్ చెప్పారు'