తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చిత్ర పరిశ్రమ సన్నిహితులు, అభిమానులు, జన సైనికులు, వీర మహిళలు, కార్యకర్తలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. తన చుట్టూ ఉన్న సమాజం ఎల్లవేళలా క్షేమంగా ఉండాలనే భగవంతుణ్ణి ప్రార్థిస్తుంటానని పేర్కొన్నారు. కరోనాతో పోరాడుతున్న ఇలాంటి క్లిష్ట సమయంలో జన్మదిన వేడుకలు దూరంగా ఉన్నట్లు తెలిపారు. జనసేన శ్రేణులు, అభిమానులు సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టి తమ అభిమానాన్ని సేవామార్గంలో వెల్లడించారని ప్రశంసించారు. వెల కట్టలేని ఈ అభిమానానికి, వాత్సల్యానికి తాను సర్వదా కృతజ్ఞుడిగా ఉంటానన్నారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: