ప్రజల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పని చేయాల్సిన విభాగాలు, కాపాడాల్సిన పోలీసు వ్యవస్థ పాలకపక్ష వైఖరితో నలిగిపోతోందని- కొందరు అధికారులు కార్యకర్తల్లా మారిపోయారని పవన్ విమర్శించారు. పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులతో సుమారు నాలుగున్నర గంటలపాటు సుదీర్ఘంగా వివిధ అంశాలపై కాన్ఫరెన్స్‌లో చర్చించారు. ప్రభుత్వ నిర్ణయాలపై ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు, వెలువరించిన అభిప్రాయాలు, న్యాయ వ్యవస్థపై అధికార పక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై పోలీసులు వేధింపులు తదితర అంశాలపై మాట్లాడారు.
పాలన వ్యవస్థ నుంచి చట్టబద్ధంగా రక్షణ, ప్రయోజనాలు లభించక, ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న వారికి పార్టీ నుంచి అండగా నిలుద్దామని పవన్ అన్నారు. ఇందుకు పార్టీ లీగల్ సెల్ సహకారం అవసరమని చెప్పారు. పార్టీ కోసం పని చేస్తూ ప్రభుత్వ ఒత్తిళ్లతో అక్రమంగా పెట్టిన కేసుల్లో చిక్కుకున్న వారికి కావల్సిన న్యాయ సహాయం చేయాలని సూచించారు. న్యాయవాద వ్యవస్థ ఈ సమాజంలో ఎంతో కీలకమని... కరోనా పరిస్థితుల్లో ఎందరో న్యాయవాదులు ఆ మహమ్మారి బారినపడ్డారని... న్యాయవాదులకు ప్రభుత్వం తక్షణం ఆరోగ్య బీమా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి