ETV Bharat / city

Pawan kalyan tweet: పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్.. " అప్పుడే యుద్ధం చేస్తా"! - పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్

Pawan kalyan tweet: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. శాంతి, యుద్ధంపై తనదైన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేశారు.

author img

By

Published : Mar 2, 2022, 5:52 PM IST

Pawan kalyan tweet: జనసేనాని పవన్ కల్యాణ్ ట్విటర్ వేదికగా ఓ పోస్టు చేశారు. యుద్ధం, శాంతి గురించి తనదైన వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న వేళ.. శాంతి-యుద్ధంపై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.

"ఒక మార్పుకోసం యుద్ధం చేయాల్సి వస్తే.. 99 సార్లు శాంతియుతంగానే ప్రయత్నిస్తాను. నూరవసారే యుద్ధం చేస్తాను" అని ట్వీట్ చేశారు పవన్. ఈ కోట్ కు.. కలంతో పుస్తకంలో రాసుకుంటున్న తన చిత్రాన్ని జోడించారు.

మార్పుకోసమే రాజకీయాల్లోకి వచ్చానని పవన్ పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పక్షంపై యుద్ధం సాగిస్తున్న పవన్.. ప్రస్తుతం ప్రపంచాన్ని యుద్ధమేఘాలు ఆవరించిన వేళ రెంటినీ మేళవిస్తూ ఈ ట్వీట్ చేశారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

ఇదీ చదవండి:

ఏపీ రాజధాని అమరావతేనన్న కేంద్రం.. బడ్జెట్‌లో కేటాయింపులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.