వ్యక్తిగత వ్యవహారంలా కక్షసాధింపు వైఖరితో వైకాపా ప్రభుత్వం పనిచేస్తోందని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. పార్టీ ముఖ్యనేతలతో పవన్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాజకీయాల కంటే ప్రజలకు ధైర్యం, భరోసా ఇవ్వడమే ముఖ్యమన్న ప్రభుత్వానికి హితవుపలికారు. రైతులు, కూలీలు, కార్మికులు, పేదల కష్టాలపై దృష్టి సారిద్దామన్న పవన్.. నిర్మాణాత్మక విమర్శలతో ప్రజలపక్షాన మాట్లాడదామన్నారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న జనసేన శ్రేణులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: 'కరోనా కేసులపై ప్రభుత్వ హెల్త్ బులెటిన్లు బోగస్'