Pawan Kalyan: నేతలు క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడే సమాజంలో సమస్యలు తెలుస్తాయని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజల ఆవేదన నుంచే పరిష్కారాలు పుట్టుకొస్తాయన్నారు. విజయవాడలో జనవాణి కార్యక్రమం ప్రారంభించిన పవన్.. ప్రజా సమస్యలు విన్నారు. నేతలు అధికారం ఉంటేనే సమస్యల పరిష్కారం అంటే కుదరదన్నారు. పదవి లేకపోయినా సమాజంలో ఇబ్బందులపై దృష్టి సారిస్తామన్నారు.
ఉదయం నుంచి మధ్యాహ్నం 3 వరకు ప్రజల నుంచి పవన్ కల్యాణ్ స్వయంగా అర్జీల స్వీకరించనున్నారు. ప్రజా సమస్యలు పట్టించుకునే తీరిక పాలకులకు లేదన్న ఆయన.. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు.
ఆర్థిక సాయం అందజేత: జూన్ 19వ తేదీన ఆత్మహత్యకు పాల్పడిన ప్రకాశం జిల్లా వంకాయలపాడు గ్రామానికి చెందిన కౌలు రైతు బాలినేని వినోద్ రెడ్డి కుటుంబానికి పవన్ కళ్యాణ్ లక్ష రూపాయల ఆర్ధిక సాయం అందజేశారు. విజయవాడలో జరుగుతోన్న జనవాణి – జనసేన భరోసా కార్యక్రమంలో పవన్ కల్యాణ్‌ని వినోద్ రెడ్డి కుమారులు మహేందర్ రెడ్డి, చరణ్ తేజ్ కలిశారు. తమ కష్టాలను చెప్పుకోగా చలించిన పవన్ కళ్యాణ్ ..వారికి ధైర్యం చెప్పి భరోసా ఇచ్చారు. అనంతరం వారి తల్లి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి, ఆర్థిక సాయానికి సంబంధించిన చెక్ అందజేశారు. వినోద్ రెడ్డి భార్య అపర్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇవీ చూడండి: