పంట నష్టాలతో రైతులు, కౌలు రైతుల ఆత్మహత్యలు బాధాకరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గోదావరి జిల్లాల్లోనే 73 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. సాగును నమ్ముకున్న వారి పరిస్థితి దయనీయంగా మారిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతలకు కొంతైనా ఊరట అందించటం కోసం జనసేన పక్షాన ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని అన్నారు.
"రైతు కుటుంబాల్లోని పిల్లల చదువులకు మేం చేసిన సాయం కొంతైనా అండగా ఉంటుంది. త్వరలోనే ప్రతి రైతు కుటుంబాన్నీ పరామర్శిస్తా. ఆర్థికసాయం అందించే ప్రక్రియ కూడా మొదలవుతుంది. కౌలు రైతుల బాధలు వింటుంటే హృదయం ద్రవిస్తుంది. కౌలు రైతుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయమూ అందట్లేదు. రైతులు, కౌలురైతుల పక్షాన జనసేన పార్టీ నిలుస్తుంది." -పవన్‌కల్యాణ్, జనసేన అధినేత
ఇదీ చదవండి: Ugadi celebrations: సీఎం క్యాంపు కార్యాలయంలో ఉగాది వేడుకలు.. పాల్గొన్న జగన్ దంపతులు