ఖరీఫ్ సీజన్లో పెట్టుబడి పెట్టిన ప్రతి పైసా నీటి పాలైందని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించట్లేదని వ్యాఖ్యానించారు. పరిహారాన్ని అందించడంలో ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. గతేడాది పరిహారం ఇప్పటికీ చెల్లించలేదని రైతులు ఆవేదన చెందుతున్నారని పవన్ అన్నారు. వరద ప్రభావిత జిల్లాల్లో జనసేన నాయకులు పర్యటించి పొలాలను పరిశీలిస్తారని తెలిపారు.
ప్రభుత్వ ప్రాథమిక అంచనాల ప్రకారమే 2.71 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా వరి పంట నీట మునిగి కుళ్లిపోతోంది. తక్షణమే పరిహారం చెల్లిస్తే రైతులు తదుపరి పంటకు సంసిద్ధులవుతారు. పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలి.
- పవన్ కల్యాణ్, జనసేన అధినేత
ఇదీ చదవండి: వరద బాధితులకు రామోజీ గ్రూప్ రూ.5 కోట్ల సాయం