ETV Bharat / city

Air Chief Marshal Vivek Ram Chaudhary: 'హెలికాప్టర్ ప్రమాదం దర్యాప్తులో.. ప్రతి సాక్షినీ విచారిస్తాం' - తెలంగాణ వార్తలు

Air Chief Marshal Vivek Ram Chaudhary : హైదరాబాద్​లోని దుండిగల్ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో పాసింగ్ ఔట్‌ పరేడ్ నిర్వహించారు. పరేడ్‌కు ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేశమే ప్రథమం కావాలని సూచించారు. ఇటీవల జరిగిన హెలికాప్టర్ ప్రమాదంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.

Air Chief Marshal Vivek Ram Chaudhary
Air Chief Marshal Vivek Ram Chaudhary
author img

By

Published : Dec 18, 2021, 4:54 PM IST

Air Chief Marshal Vivek Ram Chaudhary : త్రిదళపతి బిపిన్‌ రావత్‌ హెలికాప్టర్ ప్రమాదంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరుగుతోందని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వివేక్‌ రామ్‌ చౌదరి వెల్లడించారు. హెలికాప్టర్‌ ప్రమాదానికి కారణాలు విచారణలో తేలుతాయన్నారు. హైదరాబాద్​ నగరంలోని దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ నిర్వహించారు. పరేడ్‌కు ముఖ్య అతిథిగా ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వివేక్‌ రామ్‌ చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా.. శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్ల నుంచి ఆయన తొలి గౌరవ వందనం స్వీకరించారు. పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ సందర్భంగా క్యాడెట్లు విన్యాసాలు చేశారు.

Passing out parade at Dundigal Air Force Academy : భారత వాయుసేన అత్యంత శక్తివంతమైందని వాయుసేన చీఫ్ మార్షల్‌ వివేక్‌ రామ్‌ చౌదరి అన్నారు. దేశ సేవలో నిబద్ధతతో పనిచేయాలని క్యాడెట్లకు పిలుపునిచ్చారు. సీడీఎస్ రావత్ మరణం దురదృష్టకరమన్న ఆయన.. రావత్ దంపతులు, సైనికాధికారులకు నివాళులు అర్పించారు.

‘‘సీడీఎస్‌ రావత్ మరణం దురదృష్టకరం. రావత్‌ దంపతులు, సైనికాధికారులకు నివాళులు అర్పిస్తున్నాం. భారత వాయుసేన అత్యంత శక్తివంతమైనది. వాయుసేనలో పని చేసే అదృష్టం దక్కడం గొప్ప విషయం. శిక్షణలో సమర్థ చూపి గెలిచారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేశమే ప్రథమం కావాలి. ప్రాణాలు ఇవ్వడానికైనా వెనకడుగు వేయొద్దు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా విలువలు మరవద్దు. దేశ సేవలో నిబద్ధతతో పని చేయాలి’’.

-వివేక్‌ రామ్‌ చౌదరి, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌

ఉన్నతస్థాయి దర్యాప్తు..
air chief about helicopter crash incident : ఇటీవల జరిగిన హెలికాప్టర్ ప్రమాదంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరుగుతోందని వీఆర్ చౌదరి తెలిపారు. విచారణ కమిటీలో వాయుసేన ఉన్నతాధికారులు ఉన్నారని... ప్రమాదానికి కారణాలు విచారణలో తెలుస్తాయని చెప్పారు. ఆధారాలు లేకుండా ప్రమాదంపై ఏమీ మాట్లాడలేమన్న వీఆర్ చౌదరి... ఆధారాలు లభించిన తర్వాతే వెల్లడించగలమని పేర్కొన్నారు. ఘటనాస్థలిలో దొరికిన ప్రతి ఆధారాన్ని పరిశీలించి... ఆధారాలు సేకరిస్తారని చెప్పారు.

హెలికాప్టర్ ప్రమాదం దర్యాప్తులో భాగంగా ప్రతి సాక్షినీ విచారిస్తాం. వారాల సమయం పట్టొచ్చు. డ్రోన్ దాడులు పెద్దసవాల్‌గా మారాయి. యాంటీ డ్రోన్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. డ్రోన్ దాడుల నుంచి వీఐపీల రక్షణకు చర్యలు చేపడతాం.

ఇదీ చదవండి: Papikondalu Boat Tourism: పర్యాటకులకు గుడ్​న్యూస్.. పాపికొండలు యాత్ర పునఃప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.