ETV Bharat / city

తెలంగాణలో కఠినంగా లాక్​డౌన్... సొంతూళ్లకు వెళ్లేందుకు వలసకూలీల అవస్థలు

కరోనా కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడంతో సొంతూళ్లకు వెళ్లేందుకు వలస కార్మికులు పెద్ద సంఖ్యలో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు తరలివచ్చారు. ఫలితంగా రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాలన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.

తెలంగాణ : అమలవుతున్న లాక్​డౌన్... సొంతూళ్లకు వెళ్లేందుకు వలసకూలీల అవస్థలు

author img

By

Published : May 13, 2021, 6:09 PM IST

తెలంగాణలో లాక్‌డౌన్‌ కొనసాగుతోన్న నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ పరిసరాల వద్ద రద్దీ నెలకొంది. రిజర్వేషన్‌ చేసుకున్న ఇతర రాష్ట్రాల రోజువారీ కూలీలు, ప్రయాణికులు ఉదయం 10 గంటలలోపే రైల్వేస్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. లాక్‌డౌన్‌తో సాయంత్రం, రాత్రి వేళల్లో రవాణా సౌకర్యం ఉండదని భావించిన వారంతా.. ముందుగానే వచ్చేశారు. రైల్వే స్టేషన్‌ ఆవరణలో చెట్ల కింద ఉంటూ.. తమ రైలు బయల్దేరే సమయం వరకు వేచిచూస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రయాణికులను క్యూలైన్లు కట్టించి.. టికెట్టు ఉన్న ప్రయాణికులను లోనికి అనుమతించారు.

నగరంలోని.. నాంపల్లి రైల్వేస్టేషన్ వద్ద సైతం ఇదే పరిస్థితి నెలకొంది. ముంబై, చెన్నై, జైపూర్ తదితర ప్రాంతాలకు టిక్కెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులంతా.. స్టేషన్‌ వద్దకు చేరుకుని తమ తమ రైళ్ల కోసం వేచిచూస్తున్నారు. ఆర్పీఎఫ్ పోలీసులు వారందరినీ పరిశీలించి.. మాస్క్‌లు, శానిటైజేషన్ చేసిన తర్వాత లోలికి అనుమతిస్తున్నారు. టిక్కెట్ బుక్ చేసుకోని ప్రయాణికులను లోపలికి అనుమతించకపోవడంతో పలువురు నిరాశగా వెనుదిరుగుతున్నారు.

ఇదీ చూడండి:

ఆ 10 రాష్ట్రాల్లోనే 72% కరోనా కొత్త కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.