దశలవారీగా ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామన్న హామీని ముఖ్యమంత్రి జగన్ అమలు చేయాలని ఏపీ కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగ సంఘాల ఐకాస నేతలు డిమాండ్ చేశారు. విజయవాడ ధర్నాచౌక్ వద్ద నిరసన చేపట్టారు. 2001 నుంచి నియమితులైన పారామెడికల్ సిబ్బందిని క్రమబద్ధీకరిస్తామని నాడు చెప్పి.. ఇప్పుడు చేతులెత్తేయడం దారుణమని విమర్శించారు. వెంటనే అర్హత కలిగిన ఒప్పంద పారామెడికల్ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని ఉద్యోగ సంఘాల జేఏసీ ఛైర్మన్ రత్నాకర్ బాబు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: