విశాఖ జిల్లా సింహాచలం పంచగ్రామాల సమస్యపై కమిటీ భేటీ అయ్యింది. మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, కన్నబాబు, అవంతి శ్రీనివాస్ సహా ఎంపీలు విజయసాయిరెడ్డి, సత్యవతి తదితరులు హాజరయ్యారు. సింహాచల దేవస్థానంతో పాటు స్థానికులూ నష్టపోకుండా సమస్యను పరిష్కరించాలని కమిటీ నిర్ణయించింది.
ప్రస్తుతం పంచగ్రామాల అంశం కోర్టు పరిధిలో ఉండటంతో త్వరితగతిన కేసు పరిష్కరానికి కృషి చేయాలని కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న ఈ సమస్యపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రజల నుంచి అభ్యర్థనలు వస్తున్నాయని అధికారులు కమిటీకి తెలిపారు.
ఇదీ చదవండి: మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని రైతులకు ఇచ్చి ఆదుకోవాలి: పవన్