ప్రస్తుత పరిస్థితుల్లో అనుభవజ్ఞుడైన నేత నవ్యాంధ్రకు చాలా అవసరమని ప్రముఖ వైద్యుడు, సామాజికవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత డా.అనుమోలు శ్రీ రామారావు అభిప్రాయపడుతున్నారు. మళ్లీ తెదేపా అధికారంలోకి వస్తేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని ఆకాంక్షిస్తున్నారు. వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న చంద్రబాబుకే ప్రజలు పట్టం కడతారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ద్వారా ప్రతి ఒక్కరు ఏదో ఒక సంక్షేమ పథకం రూపంలో లబ్ధిపొందారని... ఆ సంక్షేమ పథకాలే చంద్రబాబును మళ్లీ అధికార పీఠం ఎక్కిస్తాయని శ్రీ రామారావు పేర్కొన్నారు.
ఇవీ చూడండి.