కరోనా బాధితుల అవసరాలకోసం అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్ సంస్థ(AAPI).. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏపీ శాఖకు 200 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను(Oxygen concentrators) అందించింది. విజయవాడలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. కృష్ణమోహన్ చేతుల మీదుగా రెడ్ క్రాస్ ఛైర్మన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డికి వీటిని అందజేశారు.
రెడ్ క్రాస్ అందిస్తున్న సేవలను న్యాయమూర్తి కృష్ణమోహన్ అభినందించారు. మందులు, ఆక్సిజన్ ఉచితంగా సరఫరా చేసి పేదల ప్రాణదాతలుగా మారారని కొనియాడారు. అమెరికాలో ఉన్న వారు కూడా స్పందించి మాతృదేశం కోసం.. సేవలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. కరోనా కష్టకాలంలో ఇలాంటి చేయూత ఇవ్వడం ఎంతో అవసరమని.. భవిష్యత్తులో కరోనాను ఎదుర్కొనేలా అందరూ సన్నద్దం కావాలన్నారు. సామాజిక దూరం పాటిస్తూనే.. సామాజిక సేవలో పాలు పంచుకోవాలని సూచించారు. రెడ్ క్రాస్ సొసైటీ సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
13 జిల్లాల్లోని.. 18 రెడ్ క్రాస్ సెంటర్లలో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేసినట్లు రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఆక్సిజన్ అవసరమైన వారు Toll free- 18004251234 కి ఫోన్ చేయాలని సూచించారు. వివరాలు అందిన వెంటనే ఆక్సిజన్ ఉచితంగా అందిస్తామన్నారు.
ఇవీ చదవండి:
ఆ వయసు పిల్లలకు మాస్కు అవసరం లేదా?
Cm Jagan's Delhi Tour : 84 శాతం మంది ఆ అంశానికే ఓటేశారు : లోకేశ్